Heroines : అంద‌మైన హీరోయిన్స్ ఇన్ని ర‌కాల వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్నారా..!

Authored By Sam C | The Telugu News | Published on: November 22, 2022, 1:40 pm

Heroines : ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని మ‌న పెద్ద‌లు అంటారు. మనం ఎంత సంపాదించాం అనేది మ్యాటర్ కాదు.. ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఇప్పుడు పాయింట్. ఇక సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలుగుతున్నముద్దుగుమ్మలకి డ‌బ్బు విష‌యంలో లోటు లేదు. కాని ఆరోగ్యం విష‌యంలో అనేక స‌మ‌స్య‌లు తలెత్తుతున్నాయి. ఇటీవల సమంత తను ‘మయోసైటిస్’ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పడంతో మరోసారి హీరోయిన్లు.. వారికి ఉన్న అరుదైన వ్యాధుల గురించి చర్చ న‌డుస్తుంది. స్నేహ ఉల్లాల్ అనే హీరోయిన్ “బ్రెయిన్ ట్యూమర్”తో బాధ పడుతుంది . ఇక లేడీ సూపర్ స్టార్ నయనతార..

గతంలో ఆమె చేసుకున్న ఓ సర్జరీ కారణంగా చ‌ర్మ సంబంధిత వ్యాధితో బాధ‌పుడుత‌న్న‌ట్టు టాక్. దేవదాస్ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న ఇలియానాకి డిస్‌మార్ఫిక్ బాడీ డిజార్డర్ ఉంది. ఈ విషయాన్ని చాలా సార్లు ఇలియానా చెప్పుకొచ్చింది. ఇక భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఈ విషయాన్ని పలు సందర్భాల్లో అనుష్క శర్మ అభిమానులతో పంచుకున్న విష‌యం తెలిసిందే. ఇక అనిల్ కపూర్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనమ్ కపూర్ డయాబెటీస్‌తో ఇబ్బంది పడుతోంది. ఈ విషయాన్ని ఓపెన్‌గా చెప్పడానికి ఆమె ఏనాడు భయపడలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న దీపికా పదుకొణె గత కొన్నేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతూ వ‌స్తుంది.

heroines faced with diseases

heroines faced with diseases

Heroines : పాపం వీరి ప‌రిస్థితి ఏంటి..!

బాలీవుడ్‌లో లీడింగ్ హీరోయిన్లలో ఒకరిగా ఉన్న పరిణీతి చోప్రా కూడా కొంతకాలంగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. ఈ మేరకు తను తరచూ డాక్టర్స్‌ని కలుస్తుంటుంది. ఇక ఇంత‌క ముందు సమంత తన నడుము దగ్గర ఒక చర్మ సంబంధిత వ్యాధితో బాధపడేద‌ట‌. అందుకే ఆ మధ్య నడుమును ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇష్టపడ‌లేదు. ఇప్పుడు అది తగ్గింద‌ని తెలియ‌గానే మ‌యోసైటిస్ మొద‌లైంది. ఇది కండరాలకి సంబంధించింది కావడంతో ఏ పని చేసినా తీవ్ర అలసట వచ్చేస్తుంది. ఇక తెలుగు హీరోయిన్ ప్రియాంక జ‌వాల్కర్ కూడా ఓ వ్యాధితో బాధ‌ప‌డింది. టాక్సీవాలా మూవీ రిలీజైన తర్వాత తాను థైరాయిడ్ సమస్యతో బాధ పడ్డానని ఆ సమస్య వల్ల తాను లావయ్యానని ప్రియాంక ఓ సారి చెప్పుకొచ్చింది. ఆ సమస్యతో పాటు హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా తాను ఇబ్బంది పడ్డానని ప్రియాంక తెలిపారు.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp