Heroines : ఒక‌ప్పుడు మాములుగా ఉండేవి… ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాకే ఈ భామ‌లు బాగా పెంచేశారు..!

Authored By Sam C | The Telugu News | Updated on : 2 December 2022, 11:00 am

Heroines : దీపం ఉన్న‌ప్పుడే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాల‌ని చాలామంది ముద్దుగుమ్మ‌లు భావిస్తున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు కొంద‌రు హీరోయిన్స్ ప‌రిస్థితి దారుణంగా ఉండేది. ఆస్తులు పెద్ద‌గా లేక‌పోవ‌డంతో చాలా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌రిస్థితి. కాని ఎప్పుడైతే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చారో రెమ్యున‌రేషన్ భారీగా పెంచేస్తూ ఆస్తులు బాగానే కూడ‌బెట్టుకుంటున్నారు. అలాంటి ముద్దుగుమ్మలు సినిమా ఇండ‌స్ట్రీలో ఎవ‌రున్నారో చూద్దాం. ముందుగా స‌మంత విష‌యానికి వ‌స్తే ఒక‌ప్పుడు ఆమె అకౌంట్ లో వంద రూపాయలు కూడా ఉండేటివి కాదట . ఏ మాయ చేశావే సినిమా తర్వాతే ఆమె డబ్బులు సంపాదించి తండ్రికి హెల్ప్ గా నిలిచింది.

ఇప్పుడు ఆమె రెమ్యున‌రేషన్ నాలుగు నుండి ఐదు కోట్లుగా ఉంది. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక విష‌యానికి వ‌స్తే.. చిన్నప్పుడు బొమ్మ కొనుక్కోవడానికి ఇంట్లో వారు ఆలోచించేవారట. ఎక్కడ చీప్ గా రెంటుకి ఇల్లు దొరికితే అక్కడికి షిఫ్ట్ అవుతూ ఉండేవారు. అలాంటి ర‌ష్మిక ఇప్పుడుఒక్కొక్క సినిమాకి నాలుగు నుంచి ఐదు కోట్లు రెమ్యున‌రేష‌న్ అందుకుంటుంది. ఇక పూజా హెగ్డే విష‌యానికి వ‌స్తే.. ఒక‌ప్ప‌డు ఆమె ప‌రిస్థితి దారుణంగా ఉండేది. సినిమా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చాక రేంజ్ మారింది. మొన్న‌టి వ‌ర‌కు అదృష్ట దేవతగా పూజాని చూసిన కొంద‌రు డైరెక్ట‌ర్స్ ఇప్పుడు ప‌క్క‌న పెట్టేశారు. పూజ హెగ్డే ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు.. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఐదు కోట్లు కూడా తీసుకుంటుంద‌ట‌

heroines remuneration news viral

heroines remuneration news viral

Heroines : భారీగా కూడ‌బెట్టేస్తున్నారుగా..

ఇక మ‌హాన‌టి కీర్తి సురేష్‌.. ఇండస్ట్రీలోకి రాకముందు పది రూపాయలు కావాలన్నా అమ్మని అడిగే కీర్తి సురేష్ ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరెషన్ గా అందుకుంటుంది. మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు డబ్బు కోసం చాలా అల్లాడింది . అంతే కాదు ఒకానొక టైం లో ఎయిర్ హోస్టర్స్ గా కూడా సెటిల్ అవ్వాలని అనుకుంది. కానీ శేఖర్ కమ్ముల సినిమా హ్యాపీడేస్‌తో త‌న కెరీర్ మారిపోయింది. ఈ అమ్మ‌డు ఇప్పుడు ఒక్కొక్క సినిమాకి రెండు నుంచి నాలుగు కోట్ల పారితోషకం తీసుకుంటూ ఉంది. ప్ర‌స్తుతం అయితే పెద్ద‌గా అవ‌కాశాలు లేవు.

Advertisement

Sam C

No bio available for this author.

  1. "Yawning : ఎదుటివారు ఆవలిస్తే మనకూ ఎందుకు ఆవలింత వస్తుంది? 99% ఎవ‌రికి తెలియ‌దు..!"

  2. "Rainy Season Vegetables : వర్షాకాలంలో ఈ 4 కూరగాయలు తింటే డాక్టర్ల దగ్గరకు వెళ్లాల్సిందే..!"

  3. "Ravi Teja : అచ్చం రవితేజనే అనుకుంటారు.. ఈ వ్యక్తి వీడియో చూసి షాక్ అవుతున్న నెటిజన్లు!"

  4. "Bengaluru Triple Murder AI ని ఈ రేంజ్‌లో వాడుతున్నారా.. మర్డర్ నుంచి శ‌వం మాయం చేసేవ‌ర‌కు దర్యాప్తులో షాకింగ్ విషయాలు..!"

  5. "Gabbar Singh Actor Ramesh Brain Stroke : పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్’ నటుడు రమేష్‌కు బ్రెయిన్ స్ట్రోక్.. ప‌రిస్థితి విష‌మం"

  6. "Uppal Beerappagadda : ఉప్పల్‌ బీరప్పగడ్డలో SIR ప్రచార రథానికి శ్రీకారం.. ఓటరు జాబితా సవరణపై పరమేశ్వర్ రెడ్డి కీలక పిలుపు"

  7. "Telangana Farmers : తెలంగాణ రైతులకు కేంద్రం బంపర్ గుడ్ న్యూస్ చెప్పిన మోదీ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి