Home » Entertainment » Himaja Fire On Trollers
Entertainment

Himaja : పెళ్లి, విడాకులు నాకు సెట్ కావు.. సంబంధాలు ఉంటే రిఫ‌ర్ చేయండి అంటూ హిమ‌జ ఫైర్

Authored By
Sam C
The Telugu News | Published on: January 29, 2022, 12:00 pm
Advertisement

Himaja : బిగ్ బాస్ బ్యూటీ హిమ‌జ షార్ట్ టైంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈ అమ్మ‌డి పేరు గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో భర్తను అన్‌ఫాలో చేసిందని, దీంతో త్వరలోనే విడాకులు ఇవ్వనుందంటూ రూమర్స్ వచ్చాయి. అసలు హిమజకు పెళ్లయిందనే విషయంపైనే ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు. అలాంటిది పెళ్లి, భర్తకు విడాకులేంటన్నది తెలియక నెటిజన్లు అయోమయంలో పడిపోయారు. అయితే ఈ విష‌యంపై జోరుగా ప్ర‌చారం సాగిన క్ర‌మంలో హిమ‌జ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించింది.ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో విడుదల చేసిన హిమజ… యూట్యూబ్ లో వీడియోలు చూసి ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కాల్ చేశారు.

Advertisement

కొన్ని లింక్స్ షేర్ చేశారు. హిమజకు విడాకులు అంటూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. రియాక్ట్ కావాలి అంటూ మెసేజ్ లు పంపుతున్నారు. సాధారణంగా నేను ఇలాంటి రూమర్స్ పై స్పందించను. అయితే పేరెంట్స్ బాధపడుతున్నారు. కొన్ని ఛానల్స్ యూట్యూబ్ లోనే పెళ్లిళ్లు చేసేస్తున్నారు, విడాకులు ఇచ్చేస్తున్నారు. నా పెళ్ళికి, విడాకులకు నన్ను కూడా పిలవండి.డబ్బులు ఇచ్చి ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ చేసేవాడికి బుద్ధి ఉండకపోవచ్చు. కానీ ఛానల్స్ వాళ్లకు ఉండాలిగా. నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటా. అది కూడా చాలా గ్రాండ్ గా మంచి గుడిలో, అదిరిపోయే డెకరేషన్ మధ్య గ్రాండ్ గా చేసుకుంటా. అయితే ఇప్పుడు కాదు. దానికి ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది.

himaja fire on trollers

Advertisement

Himaja : మండిప‌డ్డ హిమ‌జ‌..

ప్రస్తుతం సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడికైనా స్వేచ్ఛగా వెళ్ళిపోతా ఎవరినీ అడగాల్సిన పనిలేదు. ఈ మధ్య నా వీడియోలు యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి. అందుకే ఎవరో కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు… అంటూ తెలియజేశారు. బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న హిమజ పాపులారిటీ తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆమె యాంకర్ గా నటిగా కొనసాగుతున్నారు. వెండితెరపై ఆమెకు అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. పేరుకు యాంకరైనా స్టార్ హీరోయిన్ రేంజ్ లో ఫోటో షూట్స్ చేస్తూ ఉంటారు హిమజ. హీరోయిన్ కావాలన్న ఆమె ఆశ నెరవేరకున్నప్పటికీ సోషల్ మీడియాలో బీభత్సమైన ఫాలోయింగ్ రాబట్టారు

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి