Nagarjuna : అక్కినేని నాగార్జున ఆ భయంకరమైన అలవాటు నుంచి ఎలా బయటపడ్డారంటే..?

Authored By mallesh | The Telugu News | Updated on: December 14, 2021, 4:14 pm

Nagarjuna : అక్కినేని నాగార్జునకు ఒక్క టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు దేశవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఐదు పదుల వయస్సు దాటాక కూడా ఇప్పటికీ మన్మధుడి లుక్ లో కనిపిస్తుంటారు. అందుకు ఆయన శరీరం విషయంలో తీసుకునే కేరింగ్ కారణం.. బాడీని ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రత్యేకంగా ఫుడ్, జిమ్ వంటివి చేస్తుంటారట.. నాగార్జున తన కెరీర్ ప్రారంభం నుంచి ఒకే రకమైన పర్సనాలిటీ మెయింటెన్ చేస్తూ వస్తున్నారు. ఆయనతో పాటు వచ్చిన హీరోల్లో చాలా మార్పులు కనిపించాయి. ఒక్కోసారి లావుగా కనిపించడం, ఒక్కోసారి సన్నగా కనిపించారు. కానీ నాగ్ మాత్రం తన పర్సనాలిటీని అలాగే ఫిట్‌గా కొనసాగిస్తున్నారు. ఇండస్ట్రీలో కుర్ర హీరోలు సిక్స్ ప్యాక్ ట్రై చేయడానికి ఇబ్బందులు పడుతుంటే.. నాగ్ మాత్రం నాలుగు పదుల వయస్సులోనూ ‘ఢమరుకం’ మూవీలో సిక్స్ ప్యాక్ ట్రై చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.

Nagarjuna : నాగార్జున ఆ అలవాటు ఎలా మానుకున్నారు..

how akkineni nagarjuna got out of that terrible habit

how akkineni nagarjuna got out of that terrible habit

సినిమాల్లో హీరోలు సిగరేట్స్,మందు తాగడం కామన్. అదంతా వెండితెరపై కనిపించడం వరకే ఉంటుంది. ఆ తర్వాత ఇలాంటివి పర్సనల్ లైఫ్‌లో ఉండవు. కానీ హీరో నాగార్జున మాత్రం ఓ సినిమా వలన మందుకు అడిక్ట్ అయ్యారని తెలిసింది. ఎన్నడూ లేనిది నాగ్ మందుకు అలవాటు పడటం వలన అమల కూడా ఆందోళన చెందారట.. కారణం నేచురల్ స్టార్ నానితో నాగార్జున యాక్ట్ చేసిన దేవదాస్ మూవీ వల్లనే.. ఆ సినిమాలో నాగ్ ఎక్కువగా మందు తాగుతూ కనిపిస్తాడు. షూటింగ్‌లో అలవాటు చేసుకున్న నాగ్ ఆ తర్వాత దానిని వదిలి ఉండలేకపోయారట..

అలా ఆ భయంకరమన అల్కాహాల్‌కు అలవాలు పడిన భర్తను అమల దగ్గరుండి మానివేసేలా కేర్ తీసుకున్నారట.. ఈ విషయాన్ని నాగ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. దేవదాస్ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. కొన్నిరోజులు నాగ్ ఈ విషయంపై కొంచెం ఫీల్ అయ్యాడట.. తిరిగి తన భార్య కేరింగ్ వలన నార్మల్ పర్సన్ అయ్యానంటూ చెప్పుకొచ్చారు. నాగ్ తన వ్యక్తిగత జీవితంలో సిగరేట్, మందుకు దూరంగా ఉంటారని తెలిసింది. కేవలం ఫిట్ నెస్, ప్రోటీన్ ఆహారం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారట..

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp