how are these cute children who became star heroes in kollywood
Star Heroes : స్టార్ హీరోలకు సంబంధించిన చిన్నప్పటి పిక్స్ ఒక్కోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి.అందులోని నటుడు ఎవరో గుర్తించలేక ఫ్యాన్స్ తికమక పడుతుంటారు. తీరా తమ అభిమాన నటుడు అని తెలుసుకుని ఫుల్ ఖుషీ అవుతుంటారు. తాజాగా తమిళ నాట సూపర్ హీరోస్‌గా గుర్తింపు పొందిన సోదరుల చిత్రాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ వాటిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు చిన్నారులు ఎవరో తెలుసుకునేందుకు అభిమానులే కాకుండా నెటిజన్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ వీరిద్దరూ తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు. వీరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వీరి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మాములుగా ఉండదు. మోత మోగిపోవాల్సిందే.అయితే, వీరిద్దరూ తెలుగు హీరోలు కాకపోయినా చాలా చక్కగా తెలుగు మాట్లాడగలరు.వీరి తెలుగు అభిమానుల ఫాలోయింగ్ కూడా బానే ఉంది. ఈ బ్రదర్స్ మరెవరో కాదు. తమిళ స్టార్స్ సూర్య, కార్తీ. దక్షిణాది సినీ పరిశ్రమలోనే వీరి రేంజ్ ఇప్పుడు వేరేలా ఉంది.అన్నదమ్ములు ఇద్దరు విడివిడిగా ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేశారు. వీరికి వేర్వేరుగా ఫ్యాన్ బేస్ చాలా గట్టిగానే ఉంది.
how are these cute children who became star heroes in kollywood
అయితే, సూర్య ఇండస్ట్రీలో అడుగు పెట్టి సెప్టెంబర్ 6వ తేదితో ఏకంగా 25 సంవత్సరాలు (సిల్వర్ జూబ్లీ) కంప్లీట్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తన తమ్ముడు కార్తీ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. నా అన్నయ్య ఇండస్ట్రీలో అడుగుపెట్టిన 25 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు. తన కష్టంతో అపజయాలకు కుంగి పోకుండా విజయాల బాటలో నడిచాడు. నటన అంటే ప్రాణం ఇచ్చే తన అన్నయ్యకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ కార్తీ విష్ చేశాడు. నటుడిగానే కాకుండా ఎంతో మంది పిల్లల జీవితాలను తీర్చదిద్దిన గొప్ప వ్యక్తి అంటూ కొనియాడాడు. ప్రస్తుతం కార్తీ చేసిన ఈ ట్వీట్ సంచలనంగా మారింది.
how are these cute children who became star heroes in kollywood
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.