Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఇటీవల తాను మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలిసినప్పటి నుండి అభిమానుల్లో కలవరం మొదలైంది. అసలు సమంతకు ఈ వ్యాధి ఎందుకు వచ్చింది. ఎంతో ఫిట్ గా ఉండే సామ్ సడన్ గా హాస్పటల్ లో చేరే పరిస్థితి రావడానికి కారణంఏంటి అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇదొక ప్రాణాంతక వ్యాధి అయినప్పటికీ త్వరగానే కోలుకుంటాను అను సమంత రాసుకొచ్చింది. ఈ వ్యాధి సోకినా వారికి కండరాల బలహీనత, ఎక్కువ సేపు నిల్చోలేకపోవడం, నడవలేకపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రస్తుతం సమంత ఇదే సమస్యతో బాధపడుతోంది. సరైన వైద్యం తీసుకుంటే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చు అని అంటున్నారు. పిజ్జా లు , బర్గర్లు వంటి జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా ఈ సమస్య వస్తుందని అంటున్నారు నిపుణులు. పిజ్జా లు , బర్గర్లు లాంటి జంక్ ఫుడ్స్ కు ఎంత దూరం ఉంటే అంత మంచిదని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం సమంత హెల్త్ ఎలా ఉందనే దానిపై చర్చ నడుస్తుంది. సమంత ఆరోగ్యానికి సంబంధించి ఎవరికి వారు ఏవేవో ఊహించుకుంటూ కథలు అల్లేస్తున్నారు. సమంత పరిస్థితి దారుణం ఉందని, కొందరైతే ఆమె పరిస్థితి విషమంగా ఉందని కూడా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు.
అయితే తాజా సమాచారం ప్రకారం సమంత ఆరోగ్యం రోజురోజకి మెరుగుపడుతుందట. కండరాల నొప్పి తగ్గిందని చాలా యాక్టివ్‌గా కనిపిస్తుందని తెలుస్తుంది. ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేసినట్టు తెలుస్తుండగా, అందులోను పాజిటివ్‌గా ఉందట. సమంత ఆరోగ్యం రోజు రోజుకి మెరుగుపడుతున్న నేపథ్యంలో సమంత తల్లిదండ్రులు ఆనందబాష్పాలు కార్చినట్టు తెలుస్తుంది. ఎంతో ముద్దుగా పెంచుకున్న కూతురికి ఇంత చిన్న వయస్సులో ఇన్ని కష్టాలు రావడం వారిని చాలా ఆందోళనకు గురి చేస్తుంది. ఇక సామ్ లీడ్ రోల్‌లో నటించిన చిత్రం యశోద కాగా, సరోగసీ నేపథ్యంలో హరి- హరీశ్ సంయుక్తంగా ఈ థ్రిల్లర్‌ను రూపొందించారు. ఈ చిత్రం నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
This website uses cookies.