Naga Babu : నాగబాబు ఎంట్రీ ‘కామెడీ స్టార్స్‌’ కు కలిసి వచ్చిందా? లేదా?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 May 2022,8:00 pm

Naga Babu : ఒక ఛానల్‌ లో ప్రసారం అయిన కార్యక్రమం మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే అలాంటి కార్యక్రమే మరో ఛానల్‌ లో పేరు మార్చి కాస్త అటు ఇటుగా జనాలను మార్చి రీమేక్ చేస్తారు. అలా చేసిందే కామెడీ స్టార్స్‌. ఈటీవీలో టెలికాస్ట్‌ అవుతున్న జబర్దస్త్‌ కార్యక్రమంకు కాపీ అన్నట్లుగా స్టార్‌ మా టీవీలో కామెడీ స్టార్స్ షురూ అయ్యింది. అదే జబర్దస్త్‌ ను అంతకు ముందు జీ తెలుగు వారు కాపీ చేసి అదిరింది అనే కార్యక్రమాన్ని తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.జీ తెలుగు వారు అట్టర్‌ ప్లాప్‌ అవ్వడంతో ఇప్పుడు స్టార్‌ మాలో కామెడీ స్టార్స్ ను తీసుకు వస్తున్నారు.

కామెడీ స్టార్స్ లో మొదట జడ్జ్ లుగా వ్యవహరించిన వారి వల్ల రేటింగ్‌ తీసుకు రావడం సాధ్యం కాలేదు. దాంతో రంగంలోకి జబర్దస్త్‌ మాజీ జడ్జ్‌ నాగబాబు రంగంలోకి దిగాడు. ఆయన ఎంట్రీతో మంచి జోష్‌ వచ్చిందని కమెడియన్స్ అంటున్నారు. జీ తెలుగు లో కామెడీ షో ఆపేయడంతో అక్కడ నుండి కమెడియన్స్ అంతా కూడా స్టార్‌ మా లో ల్యాండ్‌ అయ్యారు. జబర్దస్త్‌ కు ప్రాభవం కోల్పోతున్న సమయంలో అనూహ్యంగా కామెడీ స్టార్స్ మెల్ల మెల్లగా రంగంలోకి దిగడం అభినందనీయం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇక నాగబాబు వల్ల ఖచ్చితంగా కామెడీ స్టార్స్ కు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది.

how Naga Babu help to Star Maa comedy show comedy stars

how Naga Babu help to Star Maa comedy show comedy stars

నాగబాబు మరియు శేఖర్ మాస్టర్‌ లు కలిసి చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. నాగబాబు పక్కన అప్పుడప్పుడు లేడీ రావడం లేదంటే మరెవ్వరైనా రావడం చాలా కామన్‌ విషయం అయ్యింది. షో లో నాగబాబు సెన్సాఫ్‌ హ్యూమర్‌ మరియు ఆయన ప్రోత్సహించే తీరు కారణంగా షో కు మంచి రేటింగ్‌ నమోదు అవుతుంది. జబర్దస్త్‌ కార్యక్రమం ముందు ముందు మరింతగా ఢీలా పడే అవకాశం ఉంది. కనుక కచ్చితంగా స్టార్‌ మాకు మంచి అవకాశం దక్కడం ఖాయం అంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి