Sudigali Sudheer : కామెడీ స్టార్స్ కొత్త సీజన్‌.. సుడిగాలి సుధీర్ మాత్రమే కాదు హైపర్ ఆది కూడా!

 Authored By prabhas | The Telugu News | Updated on :7 July 2022,10:00 am

Sudigali Sudheer : తెలుగు బుల్లి తెరను ఒకానొక సమయంలో శాశించిన ఈటీవీ జబర్దస్త్‌ కామెడీ షో ఇప్పుడు ప్రాభవం కోల్పోయినట్లుగా అనిపిస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతు వస్తున్న జబర్దస్త్‌ టాప్‌ రేటింగ్‌ ఈమద్య కాలంలో చాలా తక్కువ అయ్యింది. స్టార్‌ మా లో ప్రారంభం అయిన కామెడీ స్టార్స్ వల్ల మెల్ల మెల్లగా జబర్దస్త్‌ యొక్క ప్రాభవం అనేది తగ్గింది అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. ఇప్పుడు జబర్దస్త్‌ కార్యక్రమం యొక్క రేటింగ్ ను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే జరగాల్సిన నష్టం తీవ్రంగా జరిగి పోయింది అంటూ జబర్దస్త్‌ ప్రేక్షకులు మరియు అందులోని కమెడియన్స్ అంటున్నారు.

అదుగో ఇదుగో అంటూ కమెడియన్స్ పారితోషికం పెంచుకుండా జరుపుతూ వచ్చిన మల్లెమాల వారికి తీవ్రమైన నష్టం తప్పేలా లేదు. ఇప్పటికే సుధీర్ తో పాటు హైపర్ ఆది ఇంకా పలువురు ప్రముఖ కమెడియన్స్ గోడ దూకేసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో జబర్దస్త్‌ కామెడీ షో ఎటు నుండి ఎటు వైపుకు వెళ్తుంది అనేది తెలియడం లేదు. తాజాగా సుధీర్ కామెడీ స్టార్స్‌ లో జాయిన్ అయిపోయిన విషయం తెల్సిందే. ఇప్పటికే అక్కడ హడావుడి చేస్తున్న సుధీర్‌ తో పాటు హైపర్ ఆది కూడా సుడిగాలి సుధీర్ తరహా లో కామెడీ స్టార్స్ లో సందడి చేయబోతున్నాడు.

Hyper Aadi also join in star maa comedy stars show with sudigali sudheer

Hyper Aadi also join in star maa comedy stars show with sudigali sudheer

ఆది కామెడీ స్టార్స్ లో జాయిన్‌ అవ్వబోతున్నాడు అంటూ చాలా కాలం క్రితమే మేము తెలియజేశాం. కాని ఆయన అగ్రిమెంట్‌ లో ఉన్న కారణంగా స్టార్‌ మా కు కాస్త దూరం పాటిస్తూ వచ్చాడు. ఎట్టకేలకు మల్లెమాల వారితో ఉన్న అగ్రిమెంట్‌ ముగింపుకు వచ్చేసింది. దాంతో సుధీర్ తో పాటు కామెడీ స్టార్స్ కొత్త సీజన్ లో హైపర్ ఆది కూడా ఉండబోతున్నాడట. కామెడీ స్టార్స్ కొత్త సీజన్ కు నాగబాబు తో పాటు అనసూయ జడ్జ్ గా వ్యవహరించనుందట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే ఆ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవ్వబోతుందని అంటున్నారు.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి