Home » Entertainment » Hyper Aadi And Mallemala Clash
Entertainment

Hyper Aadi : కూర్చున్న కొమ్మను నరికేసుకుంటున్న మల్లెమాల.. అప్పుడు ఢీ ఇప్పుడు జబర్దస్త్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: April 21, 2022, 5:30 pm
Advertisement

Hyper Aadi : కూర్చున్న కొమ్మను నరుక్కుంటే పరిస్థితి ఏమవుతుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. అది మల్లెమాల వారికి మరి బాగా తెలుసు. అయినా కూడా తాము కూర్చుని ఎంజాయ్ చేస్తూ, బాగా సంపాదిస్తున్న కొమ్మను నరుక్కోవడం వారికి అలవాటుగా మారింది. ఢీ డాన్స్ కార్యక్రమం లో సుధీర్ మరియు రష్మి లు జోరుగా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మంచి రేటింగ్‌ తెచ్చి పెడుతున్న సమయంలో వారిద్దరిని తీసేసారు. వారిద్దరిదీ వెళ్ళిపోయాక ఢీ పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరి చూస్తూనే ఉన్నారు.

Advertisement

ఆ కార్యక్రమాన్ని మళ్ళీ జనాలు ఆదరిస్తారనే నమ్మకం లేదు. ఏ ఒక్కరు కూడా ప్రస్తుతం ఆ కార్యక్రమం గురించి చర్చించుకుంటున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇంతకు ముందు ఆ కార్యక్రమం సౌతిండియాలోని టాప్ రేటెడ్ డ్యాన్స్ కార్యక్రమంగా నిలిచింది. కానీ ఇప్పుడు అత్యంత దారుణమైన పడిపోయింది. దానికి కారణం వారు తీసుకున్న నిర్ణయం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇప్పుడు జబర్దస్త్ గురించి కూడా వారు తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్ర విమర్శలకు తావిస్తున్నాయి. జబర్దస్త్ కార్యక్రమం అంటే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది కామెడీ. ఆయన వేసే ప్రతి పంచ్‌ తెలుగు ప్రేక్షకులకు చేరువైంది.అద్భుతమైన కామెడీ టైమింగ్ తో హైపర్ ఆది ఆకట్టుకునేలా చేశాడు.

hyper aadi and mallemala clash

Advertisement

ఆయన తన జోరు కొనసాగిస్తూ వచ్చిన ఆదికి మల్లెమాల వారు గుడ్బై చెప్పేశారు. గత నాలుగైదు వారాలు జబర్దస్త్ లో హైపర్ ఆది కనిపించడం లేదు. ఏదో జరుగుతుంది అని అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో కూడా హైపర్ ఆది కనిపించకపోవడంతో డౌట్ లేకుండా అతడు మల్లెమాల నుండి తప్పుకున్నాడని క్లారిటీ వచ్చింది. పారితోషికం విషయంలో మల్లెమాల వారు చేసిన అతి కారణంగానే హైపర్ ఆది వెళ్ళిపోయాడు అనే సమాచారం అందుతోంది. చాలా కాలంగా హైపర్ ఆది మంచి పేరు దక్కించుకుంటూ స్టార్ గా నిలిచాడు. ఆయనకు ఇస్తున్న పారితోషికం ఏ మాత్రం సరిపోవడం లేదు. మూడు నాలుగు సార్లు అడిగి చూశాడు అయినా కూడా స్పందన లేకపోవడంతో గుడ్ బై చెప్పేశాడని తెలుస్తోంది.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి