Home » Entertainment » Hyper Aadi And Mla Roja Frank Comedy Went Wrong In Star Maa Tv Show
Entertainment

Hyper Aadi : ఈసారి ప్రేక్షకులు కాదు మీరు ఫూల్స్ అయ్యారు.. హైపర్ ఆది , రోజాలపై సోషల్‌ మీడియా ట్రోల్స్‌

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: March 21, 2022, 7:30 pm
Advertisement

Hyper Aadi : తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను సీరియల్స్ వారు మరియు రియాల్టీ షో వారు ఎప్పటికప్పుడు ఫూల్స్‌ చేస్తూనే ఉన్నారు. కొన్ని సార్లు ఫ్రాంక్ అంటూ ఫూల్స్‌ చేస్తుండగా.. మరికొన్ని సార్లు ఏమాత్రం లాజిక్ లేని సన్నివేశాలు మరియు కామెడీతో ఫూల్స్ చేస్తున్నారు. ఎవరు ఎంతగా ఫూల్స్ చేస్తున్న కూడా తెలుగు ప్రేక్షకులు కూడా వెండి తెర స్టార్స్ మాదిరిగానే బుల్లి తెర స్టార్స్ ను కూడా ఆరాధిస్తూనే ఉన్నారు. ఒకసారి రెండు సార్లు ఫ్రాంక్‌ చేస్తే పర్వాలేదు. కానీ మళ్లీ మళ్లీ అదే పనిగా పెట్టుకుని చేస్తే ఎవరికైనా ఎబ్బెట్టుగానే ఉంటుంది.

Advertisement

ఎన్నోసార్లు జబర్దస్త్ స్టేజీపై ఫ్రాంక్ చేసి నవ్వించేందుకు ప్రయత్నించారు. ఈ సారి ఉగాది సందర్భంగా ఈ టీవీ వారు నిర్వహించిన ప్రత్యేక షో కూడా అలాంటి ఒక ఫ్రాంక్‌ కు వేదికగా మారింది. ప్రోమో చూస్తే ఖచ్చితంగా అది ఫ్రాంక్‌ అని క్లారిటీగా తెలుస్తుంది. ఒకవేళ నిజంగా కొట్టి ఉంటే అది టెలికాస్ట్ లో నూటికి నూరు శాతం చేయరు. టెలికాస్ట్ చేయని వీడియో ని ప్రోమో గా అస్సలు విడుదల చేయరు. బుల్లెట్ భాస్కర్ ఇక్కడ ఇలా అంటే ప్రజలకు ఏం చేస్తారో అంటూ వ్యాఖ్యలు చేయడంతో రోజా యమ సీరియస్ అయినట్లు గా నటించి మరీ చెంప పగల కొట్టింది. ఆ సమయంలో ఆది వెళ్లి ఒక ఆర్టిస్టు ను ఇలాగే కొడతారా అంటూ ప్రశ్నించగా అతడిని కూడా చంప పగల గొట్టింది.

hyper aadi and mla roja frank comedy went wrong in star maa tv show

Advertisement

అది ఫ్రాంక్ అయినా కూడా రియల్ గానే కొట్టినట్టుగా చూపించారు. రియల్ గా నే కొట్టింది కూడా. రోజా కి నూటికి నూరు శాతం ఆది అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మల్లెమాల వారికి కూడా ఆది అంటే అమితమైన ప్రేమ.. అది ఎందుకు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయనవల్లే జబర్దస్త్, ఢీ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా ప్రతి ఒక్క షో నడుస్తున్నాయి. అలాంటి ఆది పై రోజా చేయి చేసుకుంటుంది అంటే ఏ ఒక్కరు నమ్మరు. కనుక ఈ సారి ఫ్రాంక్‌ చేసి వారికి వారే ఫూల్స్‌ అయ్యారు అంటూ నెటిజెన్స్ మరియు బుల్లితెర వర్గాల వారు గుసగుసలాడుకుంటున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి