Viral Video in Pygmy marmoset
Viral Video : అరేయ్.. ఎవర్రా మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు.. వీడెవడో చేతిలో పట్టుకుని నన్నే చూస్తున్నాడు.. అన్నట్లు చూస్తోంది కదూ.. దీని పేరు పిగ్మీ మార్మోసెట్ ఇది ప్రపంచంలో అతి చిన్న కోతిగా గుర్తించబడింది. ఇది దక్షిణ ఆమెరికాలోని పశ్చిమ అమెజాన్ బేసిన్ లో స్థానిక వర్షారణ్యాలలో జీవిస్తుంది. ఇది కేవలం 100 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది.పిగ్మీ మార్మోసెట్ పొడవు తల, శరీరం కలిపి 117 నుండి 152 మిల్లీమీటర్ల వరకు, తల నుండి తోకవరకు 172 నుండి 229 మీల్లీమీటర్ల వరకు ఉంటుంది.
దీని శరీరం పై బొచ్చు రంగు గోధుమరంగుతో కూడిన బంగారు రంగు, బూడిద, నలుపు రంగుకూడిన వీపు, తల, పసుపురంగు, నారింజరంగు, క్రిందిభాగంలో ఊదా రంగు కలిగి ఉంటాయి. దాని తోక నలుపు అలయాలు, దాని ముఖంపై బుగ్గలకు తెలుపు, దాని కళ్ళు మధ్య తెలుపు నిలువుగా చారలు ఉంటాయి. వీటికి పదునైన పంజావలె గోర్లు, 180 డిగ్రీలు తలను త్రిప్పగల సామర్థం ఉంటుంది. దీని దంత స్వరూపంలో ప్రత్యేక ముందరి పళ్ళు చెట్లను ఉలితో చెక్కినట్లు చేస్తాయి. ఇది నాలుగు కాళ్ళతో నడుస్తూ ఐదు మీటర్ల వరకు దుముక గలిగే సామర్థం కలిగి ఉంటుంది.
Viral Video in Pygmy marmoset
వీటికి సమూహంగా ఉండటం ఇష్టం. ఒంటరిగా ఉండలేవు. పుట్టిన 5 నెలల నుంచే పిల్లల్ని కనేయడానికి సిద్ధంగా ఉంటాయి. 135 రోజుల రర్భధారణ కాలం తరువాత ఒకటి నుండి నాలుగు వరకు పిల్లల్ని కంటాయి. వీటి సగటు జీవితకాలం 25 సంవత్సరాలు ఉంటుంది. చాలా వరకు 11 నుండి 15 ఏళ్ళె జీవిస్తాయి. వీటికి అనేక జంతువులతో ప్రమాదాలు పొంచి ఉంటాయి. పిల్లులు, పాములు, రాబందులు దాడిచేసి వీటిని ఎత్తుకుపోతూ ఉంటాయి. ఇది వింత వింత చేష్టలు చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ అయింది. నెటిజన్లు లైకులు కొడుతూ.. వావ్ .. ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్లు పెడుతున్నారు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.