Sudigali Sudheer : నేను, సుడిగాలి సుధీర్‌కు కూడా అక్కడికి వెళ్లాల్సింది కానీ.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sudigali Sudheer : నేను, సుడిగాలి సుధీర్‌కు కూడా అక్కడికి వెళ్లాల్సింది కానీ.. అసలు విషయం చెప్పిన హైపర్ ఆది

 Authored By prabhas | The Telugu News | Updated on :12 July 2022,1:00 pm

Sudigali Sudheer : జబర్దస్త్ నుంచి నితిన్ భరత్, నాగబాబు బయటకు వెళ్లడంతో చీలికలు మొదలయ్యాయి. అయితే ఆ నాడు జరిగిన ఘటనలో నాగబాబుతో కొంత మంది బయటకు వచ్చేశారు. ఇంకొంత మంది కూడా వస్తారని అంతా అనుకున్నారు. నాగబాబు అంటే వీర విధేయతను చూపించే వారైనా సుధీర్, ఆది కూడా వెళ్తారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో తేడా కొట్టేసిందట. ఆ విషయాలన్నీ కూడా తాజాగా ఆది బయటపెట్టేశాడు. ఆ గొడవ కూడా కొందరి ఆర్టిస్టుల వల్ల జరిగిందని అసలు విషయం చెప్పేశాడు. రెండు చీలికలు రావడానికి కారణం ఎవరో నాకు తెలుసు.. అది సమయం వచ్చినప్పుడు చెబుతాను. కొందరి వల్ల నితిన్ భరత్, నాగబాబు గారు బయటకు వెళ్లాల్సి వచ్చింది..

వారితో పాటు మేం కూడా వెళ్లాల్సింది.. అయితే మా ఉద్దేశ్యంలో అప్పుడు మేం ఇక్కడా అక్కడా చేసుకోగలమని అనుకున్నాం. కానీ అప్పుడే మాకు ఈ అగ్రిమెంట్ల గురించి తెలిసింది. మేం ఇంకో షోను అలా చేయలేమనే నిబంధన ఉందని మాకు తెలియడంతో మేం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది.. పైగా అక్కడి పరిస్థితులు నాకు అంతగా నచ్చలేదు అందుకే వెళ్లలేదు అని ఆది చెప్పేశాడు. అయితే నాగబాబు వెంట వెళ్లకపోవడంపైనా క్లారిటీ ఇచ్చాడు. కిరాక్ ఆర్పీ పచ్చ బొట్టు పొడిపించుకోవడంపైనా రియాక్ట్ అయ్యాడు. ఆయన మీదున్న ప్రేమ అనేది నేను చెప్పాల్సిన పని లేదు. నాకు చిరంజీవి గారి అన్నా, పవన్ కళ్యాణ్ గారు అన్నా..

Hyper Aadi And Sudigali Sudheer Did not go to Comedy Stars Adirindi Show

Hyper Aadi And Sudigali Sudheer Did not go to Comedy Stars Adirindi Show

నాగబాబు గారు అన్నా పిచ్చి.. వాళ్లను ఎవరైనా ఏమైనా అంటే.. నెగెటివ్ కామెంట్లు చేస్తే ముందుండేది నేను.. ఫస్ట్ మాట్లాడేది నేను అని ఆది అనేశాడు. అయినా నాగబాబు గారు ముందుంటే ఒకలా.. లేకపోతే ఇంకోలా మాట్లాడే వారు గురించి చెప్పాల్సిన పని లేదు. ఇవన్నీ కూడా నేరుగా ఒకరోజు నాగబాబు గారితో చెబుతాను. ఆ వ్యక్తులు ఎలాంటి వారో చెబుతాను అని ఆది అనేశాడు. మొత్తానికి అదిరింది, కామెడీ స్టార్స్ షోలకు వెళ్లలేకపోవడానికి ఆ అగ్రిమెంట్లు కూడా ఓ కారణమేనని ఆది ఒప్పుకున్నాడు. మొత్తానికి సుధీర్ అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వడంతోనే అక్కడకు వెళ్లాడని, ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వెళ్లినట్టు చెప్పకనే చెప్పేశారు.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది