Anchor Rashmi : స్టేజ్ మీద అందరి ముందు రష్మీని కావాలనే కొట్టాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Rashmi : స్టేజ్ మీద అందరి ముందు రష్మీని కావాలనే కొట్టాడా?.. హైపర్ ఆది మామూలోడు కాదు

 Authored By prabhas | The Telugu News | Updated on :7 July 2022,6:30 pm

Anchor Rashmi : యాంకర్ రష్మీతో సుధీర్ ఎక్కువ పరాచకాలు ఆడుతుంటాడు. అనసూయతో ఆది ఓ సరసం లాంటి చేష్టలు చేస్తుంటాడు. జబర్దస్త్ షోలో ఆది అనసూయ ట్రాక్.. ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో రష్మీ సుధీర్ సందడి చేసేవారు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. జబర్దస్త్ నుంచి ఆది వెళ్లిపోయాడు.. ఇప్పుడు అనసూయ కూడా తప్పుకుంది. ఇక ఎక్స్ ట్రా జబర్దస్త్ నుంచి సుధీర్ ఎప్పుడో వెళ్లిపోయాడు. రష్మీ అక్కడే ఉండిపోయింది. ఇక సుధీర్ స్థానాన్ని శ్రీదేవీ డ్రామా కంపెనీలో రష్మీ భర్తీ చేసేందుకు వచ్చింది. సుధీర్ రేంజ్‌లో కాకపోయినా రష్మీ తన స్థాయిలో షోను నడిస్తోంది. ఇక తాజాగా వదిలిన ప్రోమోలో రష్మీని వీరబాదుడు బాదేశాడు ఆది.

ఆషాడం అల్లుళ్లు అంటూ వెరైటీ కాన్సెప్ట్ తీసుకున్నారు.ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఒక చోట ఉండొద్దంటూ ఫన్ క్రియేట్ చేశారు. ఇందులో ఆదికి భార్యగా గీతా సింగ్ నటించింది. ప్రోమో మొత్తంలో ఆది అందరినీ రఫ్పాడించాడు. చివరకు రష్మీని సైతం పటా పటా వాయించేశాడు. కళ్లకు గంతలు కట్టి..మధ్యలో వదిలేస్తారు.. చుట్టూ అత్తలు ఉంటారు.. చేతికి కర్ర కూడా ఇస్తారు. ఇక కళ్లకు గంతలు కట్టిన వ్యక్తి.. అత్తలను పట్టుకుని కొట్టాలి. దీంట్లో భాగంగా ముందు ఆది మీద ప్రయోగం చేస్తారు.ఆది కళ్లకు గంతలు కడుతుంది రష్మీ. ఇక అత్తలను పట్టుకో అని రష్మీ అంటే..

Hyper Aadi Beats Anchor Rashmi in Sridevi Drama Company

Hyper Aadi Beats Anchor Rashmi in Sridevi Drama Company

ఆది మాత్రం రివర్స్‌లో వచ్చాడు. రష్మీనే అత్త అన్నట్టుగా.. టపాటపా దంచిపడేశాడు. నేను రష్మీని అని ఎంత మొత్తుకున్నా కూడా ఆది వినకుండా వాయిస్తూనే వచ్చాడు. అయితే ఆది మాత్రం కావాలనే రష్మీని అలా బాదేసినట్టు అనిపిస్తోంది. ఇక ఆది తరువాత అత్తలను పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఎంత తిరిగినా కళ్లకు గంతలు ఉండటంతో.. వారిని పట్టుకోలేకపోయాడు ఆది. చివరకు రాంప్రసాద్ వాళ్ల వద్దకు వెళ్లారు.. అటు సైడ్ వెళ్లు అని చెప్పినా కూడా ఆది వినకుండా.. రాంప్రసాద్‌ను కొట్టేశాడు. అలా ఈ ఇద్దరూ కొట్టేసుకున్నారు. మొత్తానికి ప్రోమో మాత్రం తెగ నవ్వులు పూయించారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది