Hyper Aadi : డ్యాన్స్ షో కాదు ముద్దుల షో.. ‘ఢీ’లో అరాచకాలకు ఖంగుతిన్న హైపర్ ఆది
Hyper Aadi : ఢీ షో అంటే ఒకప్పుడు డ్యాన్స్ షో అనే పేరు ఉండేది. ఆ తరువాత సుధీర్ రష్మీ ఆది వంటివారు ఎంట్రీ ఇచ్చాక అది కాస్తా కామెడీ షోగా మారింది. రాను రాను అది అడల్డ్ షోగానూ రూపాంతరం చెందింది. ఇక ఇప్పుడు ఈ షోలు ముద్దులు, హగ్గులు తప్పా ఇంకేం ఉండటం లేదు. తాజాగా వదిలిన ప్రోమో చూస్తే ఎవ్వరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ నేహాంత్ దెబ్బకు అందరూ షాక్ అయ్యారు.జబర్దస్త్ షోలో నేహాంత్ ఒక చైల్డ్ ఆర్టిస్ట్. అలానే ఫేమస్ అయ్యాడు.
కానీ ఇప్పుడు మాత్రం చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి అడల్ట్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. అటు చిన్న వాడు కాదు.. ఇటు మరీ పెద్ద వాడు కాదు. కానీ చేసే పనులు మాత్రం హద్దులు దాటుతున్నాయి. తాజాగా వదిలిన ఢీ షోలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టకుండా అందరికీ ముద్దులు పెట్టేశాడు. ఢీ షోలో కంటెస్టెంట్లు,డ్యాన్సర్లు, జడ్జ్‌లు ఇలా ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు.ఇక నందితా అయితే మరీ బరితెగించినట్టుగా మారింది. జుట్టును సరిచేసుకుని మరి రెడీగా ఉంది. రా ముద్దు పెట్టు అన్నట్టుగా ఉంది.

Hyper Aadi Child Artist Nehanth Ks To Priyamani And Nanditha Swetha In Dhee 14
నేహాంత్ అయితే మరీ చీపుగా ప్రవర్తించేశాడు. తనకు ముద్దు పెట్టడమే ఎక్కువ అంటే.. తనకు ముద్దు పెట్టిన వారిని మరీ ఆపి బలవంతంగా ముద్దులు పెట్టేశాడు. ఇవన్నీ పిల్ల చేష్టలే అనుకుంటే పర్లేదు గానీ అవే హద్దులు దాటితే ప్రమాదం.ఇక తాను ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా ప్రియమణి, నందితలకు ముద్దులు పెట్టేసి.. హైపర్ ఆదిని ఉడికించేశాడు. నేహాంత్ పెట్టే ముద్దులకు హైపర్ ఆది షాక్ అయ్యాడు. ఇక ప్రియమణి మొహాన్ని పట్టి మరీ నేహాంత్ ముద్దు పెట్టడంతో హైపర్ ఆది ఖంగుతిన్నాడు.