
social media trolls on jabardasth Hyper Aadi comedy
Hyper Aadi : హైపర్ ఆది వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేద. ప్రజెంట్ ట్రెండ్, బయట జరిగే విషయాలను తీసుకుని తన కౌంటర్లలో ఇరికిస్తాడు. బయటి ట్రెండ్ అందరూ గమనిస్తుంటారు. కాబట్టి ఆది పంచ్‌లకు అందరూ అట్రాక్ట్ అవుతుంటారు. ఇక ఆదికి ఇప్పుడు బుల్లితెరపై తిరుగు లేకుండాపోయింది. ఆది దెబ్బకు శ్రీదేవీ డ్రామా కంపెనీ డ్రామా బాగానే పేలుతోంది. మరో వైపు ఢీ షోలోనూ ఆది అదరగొట్టేస్తున్నాడు. ఆది లేక జబర్దస్త్ షో మాత్రం వెలవెలబోతోంది. ఇక ఆది తాజాగా బాలయ్యే మీద కౌంటర్లు వేశాడు. గత ఆదివారం జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీలో బోనాల జాతర స్పెసల్ ఈవెంట్ జరిగింది. అందులో ఆది రెచ్చిపోయాడు.
రష్మీ మీద ఎన్నో పంచులు వేశాడు. ఇక డూప్‌లు చేసేందుకు కొంత మంది వచ్చారు. అందులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అభిమానులున్నారు. అయితే బాలయ్య డూప్ పక్కన నిల్చున్న ఆది ఓ కౌంటర్ వేశాడు. మధుప్రియ ఈ ఈవెంట్‌లో ఉండటంతో పాటల విషయం వచ్చాయి. నేను పాట పాడతాను అని రష్మీ అనడంతో.. ఆది కౌంటర్ వేశాడు. ఆ మధ్య ఒక పాట పాడావు కదా? అది పాడు అని ఆది అంటాడు. రష్మీ పాడటంతో.. పదాలన్నీ అడ్డదిడ్డంగా వాడేస్తుంది. ఆపు అని ఆది అంటాడు. ఈ పాట ఇస్తేనే ఇలా చేశావ్.. ఇంకా నీకు శివరంజనీ పాట ఇస్తే బాలయ్యలా అని ఆది.. బాలయ్య డూప్‌ను చూస్తాడు. అమ్మో పక్కన బాలయ్య ఉన్నాడు అని కాస్త భయపడ్డట్టు చేసేస్తాడు.
hyper aadi counters on rashmi gautam singing and balakrishna shiva ranjani singing
అలా బాలయ్య శివరంజనీ పాడిన విధానం మీద ఆది మెల్లిగా కౌంటర్లు వేసినట్టు అయింది. అసలే గత ఏడాది బాలయ్య పాడిన ఆ పాట ఎన్ని విమర్శలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అంత గొప్ప పాటను కూనీ చేశాడంటూ బాలయ్యను కొందరు విమర్శించారు. అయితే అలాంటి పాటను ట్రై చేయడమే గొప్ప.. బాలయ్య పాడేశాడు కదా? అని ఇంకొందరు ఆయన్ను మెచ్చుకున్నారు. ఆది ఇలా కౌంటర్లు వేయడంతో మరోసారి ఈ చర్చ తెర మీదకు వచ్చింది. మొత్తానికి ఆది మాత్రం ఇలా తన ట్రెండింగ్ పంచ్‌లతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు.
Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…
ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…
viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…
RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…
TVS Jupiter : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ 110 ( TVS Jupiter 110 )…
Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…
అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో…
Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ జనవరి 19 ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. హాస్పిటల్‌కు…
This website uses cookies.