Hyper Aadi : బాలయ్య పాడిన శివరంజనీ పాట.. పరువుతీసిన హైపర్ ఆది

Authored By aruna | The Telugu News | Updated on: August 3, 2022, 9:31 am

Hyper Aadi : హైపర్ ఆది వేసే కౌంటర్లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందేద. ప్రజెంట్ ట్రెండ్, బయట జరిగే విషయాలను తీసుకుని తన కౌంటర్లలో ఇరికిస్తాడు. బయటి ట్రెండ్ అందరూ గమనిస్తుంటారు. కాబట్టి ఆది పంచ్‌లకు అందరూ అట్రాక్ట్ అవుతుంటారు. ఇక ఆదికి ఇప్పుడు బుల్లితెరపై తిరుగు లేకుండాపోయింది. ఆది దెబ్బకు శ్రీదేవీ డ్రామా కంపెనీ డ్రామా బాగానే పేలుతోంది. మరో వైపు ఢీ షోలోనూ ఆది అదరగొట్టేస్తున్నాడు. ఆది లేక జబర్దస్త్ షో మాత్రం వెలవెలబోతోంది. ఇక ఆది తాజాగా బాలయ్యే మీద కౌంటర్లు వేశాడు. గత ఆదివారం జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీలో బోనాల జాతర స్పెసల్ ఈవెంట్ జరిగింది. అందులో ఆది రెచ్చిపోయాడు.

రష్మీ మీద ఎన్నో పంచులు వేశాడు. ఇక డూప్‌లు చేసేందుకు కొంత మంది వచ్చారు. అందులో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ అభిమానులున్నారు. అయితే బాలయ్య డూప్ పక్కన నిల్చున్న ఆది ఓ కౌంటర్ వేశాడు. మధుప్రియ ఈ ఈవెంట్‌లో ఉండటంతో పాటల విషయం వచ్చాయి. నేను పాట పాడతాను అని రష్మీ అనడంతో.. ఆది కౌంటర్ వేశాడు. ఆ మధ్య ఒక పాట పాడావు కదా? అది పాడు అని ఆది అంటాడు. రష్మీ పాడటంతో.. పదాలన్నీ అడ్డదిడ్డంగా వాడేస్తుంది. ఆపు అని ఆది అంటాడు. ఈ పాట ఇస్తేనే ఇలా చేశావ్.. ఇంకా నీకు శివరంజనీ పాట ఇస్తే బాలయ్యలా అని ఆది.. బాలయ్య డూప్‌ను చూస్తాడు. అమ్మో పక్కన బాలయ్య ఉన్నాడు అని కాస్త భయపడ్డట్టు చేసేస్తాడు.

hyper aadi counters on rashmi gautam singing and balakrishna shiva ranjani singing

hyper aadi counters on rashmi gautam singing and balakrishna shiva ranjani singing

అలా బాలయ్య శివరంజనీ పాడిన విధానం మీద ఆది మెల్లిగా కౌంటర్లు వేసినట్టు అయింది. అసలే గత ఏడాది బాలయ్య పాడిన ఆ పాట ఎన్ని విమర్శలకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. అంత గొప్ప పాటను కూనీ చేశాడంటూ బాలయ్యను కొందరు విమర్శించారు. అయితే అలాంటి పాటను ట్రై చేయడమే గొప్ప.. బాలయ్య పాడేశాడు కదా? అని ఇంకొందరు ఆయన్ను మెచ్చుకున్నారు. ఆది ఇలా కౌంటర్లు వేయడంతో మరోసారి ఈ చర్చ తెర మీదకు వచ్చింది. మొత్తానికి ఆది మాత్రం ఇలా తన ట్రెండింగ్ పంచ్‌లతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు.

aruna

No bio available for this author.

  1. "Today Horoscope : 23 నవంబర్ 2026 సోమ‌వారం ఈ రోజు మీ రాశి ఫలాలు.. ఈ రాశులకు ధనలాభం..!"

  2. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  3. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  4. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  5. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  6. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  7. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp