Hyper Aadi : హైపర్ ఆది చాలా తెలివైనోడు బాసు… హీరో ఆఫర్‌ లకు రియాక్షన్‌! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హైపర్ ఆది చాలా తెలివైనోడు బాసు… హీరో ఆఫర్‌ లకు రియాక్షన్‌!

Hyper Aadi : అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న వాడు భవిష్యత్తులో లాభపడతాడు.. సుఖ పడుతాడు.. సక్సెస్‌ అవుతాడు. అనుభవాల పాఠాలను పట్టించుకోని వాడు ప్లాప్‌ అవుతాడు.. నష్టపోతాడు.. ఫెయిల్‌ అవుతాడు. ఈ విషయం ఎన్నో సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఇప్పుడు హైపర్‌ ఆది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. లక్షల్లో పారితోషికం ఇచ్చి హీరోను చేస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్నా కూడా ఆది మాత్రం ఆసక్తి చూపడం లేదు. తన చెంతకు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :2 June 2022,1:00 pm

Hyper Aadi : అనుభవాల నుండి పాఠాలు నేర్చుకున్న వాడు భవిష్యత్తులో లాభపడతాడు.. సుఖ పడుతాడు.. సక్సెస్‌ అవుతాడు. అనుభవాల పాఠాలను పట్టించుకోని వాడు ప్లాప్‌ అవుతాడు.. నష్టపోతాడు.. ఫెయిల్‌ అవుతాడు. ఈ విషయం ఎన్నో సందర్బాల్లో నిరూపితం అయ్యింది. ఇప్పుడు హైపర్‌ ఆది గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు. లక్షల్లో పారితోషికం ఇచ్చి హీరోను చేస్తాం అంటూ ఆఫర్లు ఇస్తున్నా కూడా ఆది మాత్రం ఆసక్తి చూపడం లేదు. తన చెంతకు వచ్చిన పదుల కొద్ది ఆఫర్లను సున్నితంగా ఆది తిరష్కరించాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు.

జబర్దస్త్‌ తో మంచి గుర్తింపు దక్కించుకున్న ధన్‌రాజ్ నుండి మొదలుకుని గెటప్ శ్రీను.. సుడిగాలి సుధీర్ మరియు రామ్‌ ప్రసాద్‌ వరకు ఎంతో మంది కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. హీరోగా ప్రయత్నాలు చేసిన వారిలో ఒకరు ఇద్దరు పర్వాలేదు అనిపించినా ఎక్కువ శాతం మంది నిరాశ పర్చారు. ముఖ్యంగా ధన్‌ రాజ్‌ హీరోగా చేయడం వల్ల మళ్లీ జీరో పరిస్థితి కి పడి పోయాను అంటూ పలు సందర్బాల్లో కన్నీళ్లు పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. హీరోగా ధన్‌ రాజ్‌ చేసిన సినిమా ప్లాప్‌ అవ్వడంతో పాటు ఆయన నిర్మాతగా కూడా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నాడు.

Hyper Aadi dont want to do movies as hero

Hyper Aadi dont want to do movies as hero

ఇక సుధీర్‌ కూడా వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు స్టార్‌ డమ్‌ అయితే దక్కలేదు. గెటప్ శ్రీను కూడా మొదటి సారి సోలో హీరోగా సినిమా ను చేస్తున్నాడు. ఇదే సమయంలో హైపర్ ఆదికి వస్తున్న ఆఫర్లను సున్నితంగా తిరష్కరిస్తున్నాడట. బాబోయ్‌ హీరోగా నా వల్ల కాదు.. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎలాంటి సినిమాలో అయినా నేను నటించేందుకు రెడీ అన్నట్లుగా ఆది ఓపెన్‌ ఆఫర్‌ ను ఇచ్చాడట. దాంతో ఆయన తెలివికి అంతా కూడా ఫిదా అవుతున్నారు. హైపర్ ఆది చాలా తెలివైన వాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది