Hyper Aadi : పంచ్ ప్రసాద్ భార్య గురించి ఇంత కన్నా గొప్పగా చెప్పలేరు.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 13, 2022, 9:00 pm

Hyper Aadi : హైపర్ ఆది ఎప్పుడూ నవ్విస్తూనే ఉంటాడు. ఆయన వేసే పంచులు కూడా అలానే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం ఆది తన గుండె లోతుల్లోంచి కొన్ని మాటలు అంటాడు. పవన్ కళ్యాణ్ గురించి షోల్లో చెప్పే సమయంలో అనే మాటలు, ఎమోషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. తన తల్లిదండ్రుల గురించి, తన స్ట్రగుల్స్ గురించి చెప్పి ఎన్నో సార్లు అందరినీ ఏడిపించేశాడు. తాజాగా పంచ్ ప్రసాద్ భార్య గురించి ఎంతో గొప్పగా చెప్పాడు. పంచ్ ప్రసాద్, అతని భార్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పంచ్ ప్రసాద్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రేమ అంటే కలిసి తిరిగి ఎంజాయ్ చేసేటువంటి ప్రేమ కాదు. జీవితాంతం తన భర్త కోసం నిలబడే ప్రేమ అది. ఏ భార్య చేయని త్యాగం చేసే ప్రేమ అది. పంచ్ ప్రసాద్ చావు బతుకుల్లో ఉన్నా కూడా వదలని ప్రేమ అది. పెళ్లికి ముందే.. పంచ్ ప్రసాద్ రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి. చావు బతుకుల్లో ప్రసాద్ ఉన్నాడు. అలాంటివాడిని ఏం చేసుకుంటావ్ అని అందరూ వేలెత్తి చూపారు. అయినా కూడా తాను ప్రేమించిన వ్యక్తిని వదిలిపెట్టలేదు. కాపాడుకుంది.

Hyper Aadi Emotional Words on Punch Prasad Wife

Hyper Aadi Emotional Words on Punch Prasad Wife

ఓ కిడ్నీ ఇచ్చేందుకు కూడా ముందుకు వచ్చింది. అలా తన భర్త కోసం అందరినీ ఎదిరించింది పంచ్ ప్రసాద్ భార్య. తాజాగా వీరి జర్నీని ఓ పర్ఫామెన్స్లో చూపించారు. శ్రీదేవీ డ్రామా కంపెనీలో నెంబర్ వన్ జోడి అనే కాన్సెప్టుతో వచ్చే ఆదివారం షోను రన్ చేస్తున్నారు. ఇందులో పంచ్ ప్రసాద్ లవ్ స్టోరిని పర్ఫామెన్స్ చేసి చూపించారు. అది చూసి పంచ్ ప్రసాద్ భార్య ఎమోషనల్ అయింది. ప్రేమ కోసంఎంతో ఖర్చు పెట్టిన వారిని చూశాం గానీ.. ప్రేమ కోసం తన జీవితాన్ని ఖర్చు పెట్టింది అంటూ ఆమె మీద ఆది ప్రశంసల వర్షం కురిపించేశాడు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp