Hyper Aadi : రెచ్చిపోయిన జానీ మాస్టర్.. హైపర్ ఆదికి కడుపు మండిపోయినట్టుందిగా
Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది ఫ్రస్ట్రేషన్, పంచ్‌లు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అది జబర్దస్త్ షో అయినా, ఢీ షో అయినా కూడా ప్రాసలతో పంచులు మాత్రం కామన్. అలా అనసూయతో జబర్దస్త్ షోలో, ప్రియమణితో ఢీ షోలో పులిహోర కలుపుతూ నెట్టుకొస్తున్నాడు హైపర్ ఆది. ఢీ షోలో అయితే ప్రియమణితో మరింత హద్దులు దాటుతుంటాడు ఆది.
ప్రియమణితో హగ్గులు, బావ అని పిలుపించుకోవడం చేస్తూ ఆది తెగ రెచ్చిపోతుంటాడు. ఇక ఈ మధ్య కొత్తగా వచ్చిన నందిత శ్వేతను కూడా వదలడం లేదు. ఒక హగ్ ఇవ్వాల్సిందే అంటూ తాజాగా ఆది రెచ్చిపోయాడు. ఆది అంటే బొగ్గు అనుకుంటివా.. హగ్గు అని రెచ్చిపోయాడు. అయితే ఆది ఒక హగ్ కోసం నందిత, ప్రియమణిల వద్దకు వస్తాడు.

Hyper Aadi Fires on Jani Master In Dhee show
Hyper Aadi : జానీ మాస్టర్ హగ్గులు..
కానీ జానీ మాస్టర్ మాత్రం ప్రియమణి, నందిత వద్ద హగ్గులు తీసుకుంటూ ఉంటాడు. మా పేర్లు చెప్పుకుని ఎన్ని సార్లు హగ్స్ తీసుకుంటారు అని ఆది తనలోని కడుపు మంటను బయటపెట్టేశాడు. అయినా జానీ మాస్టర్ ఏ మాత్రం తగ్గలేదు.. మీకు అయితే ఇవ్వరు. .నాకు చూశావా? అన్నట్టుగా వారిద్దరితో హగ్గులు తీసుకుంటూ జానీ మాస్టర్ దుమ్ములేపేశాడు.
