Hyper Aadi : హైపర్ ఆది నిజ స్వరూపమిదే.. అసలు విషయం చెప్పిన కమెడియన్ల ఫ్యామిలీ మెంబర్లు

Authored By Sam C | The Telugu News | Published on: March 12, 2022, 9:00 pm

Hyper Aadi : బుల్లితెర పాపుల‌ర్ షోస్‌లో జ‌బ‌ర్ధ‌స్త్ షో కూడా ఒక‌టి.ఈ షో ద్వారా చాలా మంది క‌మెడీయ‌న్స్ వెలుగులోకి వ‌చ్చారు. వారిలో హైప‌ర్ ఆది ఒక‌రు. ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే మరోవైపు సినిమాలు కూడా చేస్తున్నారు . బయట ఎంత బిజీగా ఉన్నా తమకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ కామెడీ షోను మాత్రం వదలట్లేదు కమెడియన్స్. హైప‌ర్ ఆది ఇటీవ‌లి కాలంలో ఈటీవీ ప్ర‌తి షోలో క‌నిపిస్తున్నాడు. ఆయ‌న చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. పంచ్‌లు అలా విసురుతూ ప్రేక్ష‌కుల‌ని తెగ న‌వ్విస్తున్నాడు. తాజాగా హైప‌ర్ ఆది ఎక్స్‌ట్రా జ‌బ‌ర్ధ‌స్త్ స్కిట్‌లోతెగ న‌వ్వించాడు. పని అమ్మాయితో క‌లిసి ఆయ‌న చేసిన సంద‌డి వేరే లెవ‌ల్ అని చెప్పాలి.

ప‌ని అమ్మాయి హైప‌ర్ ఆది.. డైలాగులు పెంచ‌మ‌ని అడ‌గగా, అంద‌రు జీతాలు పెంచ‌మని అడుగుతారు, నువ్వేంది డైలాగులు పెంచ‌మ‌ని అడుగుతున్నావు అని ఆది అంటాడు. దానికి స్పందించిన ప‌ని అమ్మాయి వేరే వాడి స్కిట్ అనుకోండి జీతం పెంచ‌మ‌ని అడుగుతాం, మీ స్కిట్ కాబ‌ట్టి డైలాగులు పెంచ‌మ‌ని అడుగుతున్నాను. దీనికి ఆది నీకు ఆ మాత్రం క్లారిటీ ఉంది చాలు అని అన‌గా, రోజా మాకు కూడా ఉంద‌ని అంటాడు. ఇక మనో ఎక్కువ‌గా కీమా తింటాడు అనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఇక ఈ స్కిట్‌తో ఫ్యామిలీ మెంబ‌ర్స్‌ని కూడా ఇంట్ర‌డ్యూస్ చేశాడు.

hyper aadi punches full fun to the audience

hyper aadi punches full fun to the audience

Hyper Aadi : హైప‌ర్ ఆది పంచ్‌లే వేర‌ప్పా..

క‌మెడీయ‌న్స్ ఫ్యామిలీ స‌భ్యులు హాజ‌రై తెగ సంద‌డి చేశారు. ఈ స్కిట్ అల‌రిస్తుంది. నేటి సాయంత్రం ఫుల్ స్కిట్ ప్ర‌సారం కానుండ‌గా, దీని కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మాట మాటకు పంచ్ విసరడం, లేటెస్ట్ ఇష్యూలనే టార్గెట్ చేస్తుండటం ఆది నైజం. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఇన్సిడెంట్స్ తన స్కిట్స్‌కి ఆటం బాంబ్స్ అని ఫీలవుతుంటాడు హైపర్ ఆది. ఇక అనసూయ కనిపిస్తే మనోడి చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. బుల్లితెరపై హైపర్ ఆది- అనసూయ జోడీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పటికే ఆన్ స్క్రీన్‌పై చాలాసార్లు రొమాంటిక్ స్టెప్పులేసి బుల్లితెర ఆడియన్స్‌కి కిక్కిచ్చింది ఈ జోడీ.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp