Hyper Aadi : జబర్దస్త్ కార్యక్రమానికి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన హైపర్ ఆది ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడి ఎంట్రీ తో కార్యక్రమానికి ఊపు వచ్చింది. సాధారణంగా జబర్దస్త్ లో ఒక్కొక్క టీం కి ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు, కానీ హైపర్ ఆది స్కిట్ ఎంత సమయం ఉన్న ప్రేక్షకులు విసుగు లేకుండా చూస్తారనే ఉద్దేశంతో ఏకంగా 13 నుండి 14 నిమిషాల సమయంను ఇచ్చినట్లుగా నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే అర్థమవుతుంది. హైపర్ ఆది ఎంట్రీ నేపధ్యంలో గత వారం రోజులుగా హడావుడి కనిపిస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్‌ని చూద్దామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు యూట్యూబ్లో చూసేవారు కూడా ఈ టీవీ పెట్టి మరి నిన్న రాత్రి చూసేశారు. దాంతో రేటింగ్ భారీ తగిన నమోదు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
ఈ మధ్య కాలంలో జబర్దస్త్ రేటింగ్ పడిపోయింది అంటూ చాలా మంది అంటున్నారు. ఆది రాకతో ఆ రేటింగ్ మళ్ళీ పుంజుకున్నట్లే అంటూ అభిమానులు మరియు ఈటీవీ వర్గాల వారు చెబుతున్నారు. హైపర్ ఆది రీఎంట్రీ మరియు ఇతర కామెడీ స్కిట్స్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్న కారణంగా జబర్దస్త్ కి మళ్లీ మంచి రోజులు రావడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో సోషల్ మీడియాలో సందడి చేసిన బంగారం అమ్మాయిని తీసుకు వచ్చి చంటి తన స్కిట్ లో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అందుకే కచ్చితంగా ఈ ఎపిసోడ్ కి మంచి రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు.
అనధికారిక సమాచారం ప్రకారం 12 నుండి 15 రేటింగు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి రేటింగ్ విషయంలో ఈటీవీ మళ్లీ టాప్ లోకి తీసుకెళ్లడానికి హైపర్ ఆది ఎంట్రీ ఉపయోగపడుతుంది అంటూ ఈటీవి వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బుల్లి తెర తో పాటు వెండి తెరపై కూడా హైపర్ ఆది సందడి చేస్తున్నాడు. మూడు నాలుగు సినిమాల్లో ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా నటించే అవకాశాలు వస్తున్నా ప్రస్తుతానికి హీరోగా చేయను అంటూ హైపర్ ఆది ఆ అవకాశాలను తిరస్కరిస్తున్నాడు. ప్రస్తుతం ఈటీవీ షో ల పైనే పూర్తి దృష్టి హైపర్ ఆది పెట్టాడు. ఇతర చానల్స్ నుండి వస్తున్న అన్ని ఆఫర్లను అతడు తిరస్కరిస్తూనే ఉన్నాడు.
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
This website uses cookies.