Hyper Aadi : హైపర్ ఆది రీ ఎంట్రీ జబర్దస్త్‌ ఎపిసోడ్‌ రేటింగ్‌ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హైపర్ ఆది రీ ఎంట్రీ జబర్దస్త్‌ ఎపిసోడ్‌ రేటింగ్‌ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Hyper Aadi : జబర్దస్త్ కార్యక్రమానికి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన హైపర్ ఆది ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడి ఎంట్రీ తో కార్యక్రమానికి ఊపు వచ్చింది. సాధారణంగా జబర్దస్త్ లో ఒక్కొక్క టీం కి ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు, కానీ హైపర్ ఆది స్కిట్ ఎంత సమయం ఉన్న ప్రేక్షకులు విసుగు లేకుండా చూస్తారనే ఉద్దేశంతో ఏకంగా 13 నుండి 14 నిమిషాల సమయంను ఇచ్చినట్లుగా నిన్నటి […]

 Authored By aruna | The Telugu News | Updated on :17 September 2022,12:30 pm

Hyper Aadi : జబర్దస్త్ కార్యక్రమానికి కొన్ని నెలలు గ్యాప్ ఇచ్చిన హైపర్ ఆది ఎట్టకేలకు రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అతడి ఎంట్రీ తో కార్యక్రమానికి ఊపు వచ్చింది. సాధారణంగా జబర్దస్త్ లో ఒక్కొక్క టీం కి ఏడు నుండి ఎనిమిది నిమిషాల సమయం మాత్రమే ఇస్తారు, కానీ హైపర్ ఆది స్కిట్ ఎంత సమయం ఉన్న ప్రేక్షకులు విసుగు లేకుండా చూస్తారనే ఉద్దేశంతో ఏకంగా 13 నుండి 14 నిమిషాల సమయంను ఇచ్చినట్లుగా నిన్నటి ఎపిసోడ్ చూస్తుంటే అర్థమవుతుంది. హైపర్ ఆది ఎంట్రీ నేపధ్యంలో గత వారం రోజులుగా హడావుడి కనిపిస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్‌ని చూద్దామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు యూట్యూబ్లో చూసేవారు కూడా ఈ టీవీ పెట్టి మరి నిన్న రాత్రి చూసేశారు. దాంతో రేటింగ్ భారీ తగిన నమోదు అవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈ మధ్య కాలంలో జబర్దస్త్ రేటింగ్ పడిపోయింది అంటూ చాలా మంది అంటున్నారు. ఆది రాకతో ఆ రేటింగ్ మళ్ళీ పుంజుకున్నట్లే అంటూ అభిమానులు మరియు ఈటీవీ వర్గాల వారు చెబుతున్నారు. హైపర్ ఆది రీఎంట్రీ మరియు ఇతర కామెడీ స్కిట్స్ పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్న కారణంగా జబర్దస్త్ కి మళ్లీ మంచి రోజులు రావడం ఖాయం అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో సోషల్ మీడియాలో సందడి చేసిన బంగారం అమ్మాయిని తీసుకు వచ్చి చంటి తన స్కిట్ లో కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. అందుకే కచ్చితంగా ఈ ఎపిసోడ్ కి మంచి రేటింగ్ వస్తుందని భావిస్తున్నారు.

Hyper Aadi re entry in jabardasth and show get super

Hyper Aadi re entry in jabardasth and show get super

అనధికారిక సమాచారం ప్రకారం 12 నుండి 15 రేటింగు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి రేటింగ్ విషయంలో ఈటీవీ మళ్లీ టాప్ లోకి తీసుకెళ్లడానికి హైపర్ ఆది ఎంట్రీ ఉపయోగపడుతుంది అంటూ ఈటీవి వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు బుల్లి తెర తో పాటు వెండి తెరపై కూడా హైపర్ ఆది సందడి చేస్తున్నాడు. మూడు నాలుగు సినిమాల్లో ఆయన ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. హీరోగా నటించే అవకాశాలు వస్తున్నా ప్రస్తుతానికి హీరోగా చేయను అంటూ హైపర్ ఆది ఆ అవకాశాలను తిరస్కరిస్తున్నాడు. ప్రస్తుతం ఈటీవీ షో ల పైనే పూర్తి దృష్టి హైపర్ ఆది పెట్టాడు. ఇతర చానల్స్ నుండి వస్తున్న అన్ని ఆఫర్లను అతడు తిరస్కరిస్తూనే ఉన్నాడు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది