Sampoornesh Babu item song offer to Conductor Jhansi
Conductor Jhansi : సోషల్ మీడియా సెన్సేషన్ కండక్టర్ ఝాన్సీ కి ఆఫర్లు వెల్లు వెత్తుతున్నాయి. మొన్నటి వరకు 2 వేలు 3 వేల రూపాయలకు స్టేజిపై డాన్స్ లు చేసిన కండక్టర్ ఝాన్సీ ఇప్పుడు 10000 నుండి 15000 రూపాయల రోజు వారి పారితోషికం తీసుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. ఇప్పుడు ఆమె స్థాయి మరింతగా పెరగబోతుంది. ఏకంగా లక్షల రూపాయలు ఆమెకు పారితోషికంగా అందబోతున్నాయి. తాజాగా సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంపూర్ణేష్ బాబు తాను నటిస్తున్న సినిమాలో కండక్టర్ ఝాన్సీ తో ఐటెం సాంగ్ చేయించేందుకు రెడీ అయ్యాడట. స్వయంగా సంపూర్ణేష్ బాబు ఆమెను సంప్రదించి తమ సినిమాలో ఐటెం సాంగ్స్ చేయాలని విజ్ఞప్తి చేశాడట.. అందుకు కండక్టర్ ఝాన్సీ ఓకే చెప్పిందని, ఆమెతో పాటు ఆమె ట్రూప్ అంతా కూడా ఆ సినిమాలోని ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నారంటూ సమాచారం అందుతోంది.
ఎన్నో ఇబ్బందులు పడి ఈ స్థాయికి వచ్చిన కండక్టర్ ఝాన్సీకి సంపూర్ణేష్ బాబు అవకాశం ఇవ్వడమనేది నిజంగా గొప్ప విషయం. ఆయనే ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలో ఎదుగుతున్నాడు. అలాంటి వ్యక్తి ఇతరులకు అవకాశాలు ఇవ్వడం అనేది నిజంగా గొప్ప విషయంగా నెటిజ్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తలుచుకుంటే కండక్టర్ ఝాన్సీ కి ఎంతో మంది పెద్ద హీరోలు దర్శకులు అవకాశం ఇవ్వచ్చు.. కానీ ఆమెను ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. కేవలం సంపూర్ణేష్ బాబు మాత్రమే పట్టించుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో అతడిని దేవుడు అంటూ కితాబిస్తున్నారు. ఎవరు ఆపదలో ఉన్నా కూడా తన వంతు సాయం చేసేందుకు ఎప్పుడు ముందుపడే సంపూర్ణేష్ బాబు తాజా విషయంలోనూ మరోసారి దేవుడు అనిపించుకున్నాడు.
Sampoornesh Babu item song offer to Conductor Jhansi
నువ్వు హీరోవా అంటూ చాలా మంది సంపూర్ణేష్ బాబును అవహేళన చేశారు. కానీ ఇప్పుడు నిజమైన హీరో సంపూర్ణేష్ బాబు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. సంపూర్ణేష్ బాబు అవకాశమును కండక్టర్ ఝాన్సీ సద్వినియోగం చేసుకుని ఐటమ్ సాంగ్ లో మంచి ప్రతిభ కనబరిచితే తప్పకుండా ముందు ముందు టాలీవుడ్ లో బిజీ డాన్సర్ గా మారే అవకాశం ఉంది. ఆమెకు సినిమాల్లో నటించేందుకు మరిన్ని ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ లో మళ్ళీ మళ్ళీ కనిపించాలని ఆమె కోరుకుంటుంది, కానీ షో నిర్వాహకులు మాత్రం ఆమెను అప్పుడప్పుడు మాత్రమే తీసుకుంటామని ముందే చెప్పారట. ఇతర చానల్స్ నుండి కూడా మెల్లమెల్లగా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. కనుక రాబోయే రోజుల్లో కండక్టర్ ఝాన్సీ కచ్చితంగా ఒక బుల్లి తెర సెన్సేషన్ అన్నట్లుగా నిలవడం ఖాయం.
Junior Movie Review : 'కిరీటి రెడ్డి'.. Kireeti sreeleela నిన్న మొన్నటి వరకూ అయితే ఈ పేరు పెద్దగా…
Pregnant Women : ప్రకృతి ప్రసాదించిన పండ్లలో నేరేడు పండు కూడా ఒకటి. ఇది సీజనల్ పండు. ఇది వేసవికాలం…
Gas Cylinder : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక భారం తగ్గించేందుకు దీపం 2 పథకం లో ఒక…
Home Remedies : ఈ రోజుల్లో చాలామందికి కంటికి నిద్ర లేకపోవడం వలన, కొన్ని జీవనశైలిలో మార్పులు వలన, కళ్ళ…
Kavitha : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన తాజా…
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పెట్టే వస్తువులు అయినా,దేవుని విగ్రహాలైనా సరే వీటి విషయంలో చాలా…
Tripathi : ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నల్గొండ జిల్లా స్థాయి మొదలుకొని గ్రామ స్థాయి వరకు అధికారులు,సిబ్బంది ఎలాంటి విమర్శలు,ఆరోపణలకు…
Vajresh Yadav : ఇందిరమ్మ రాజ్యంలోనే పేదల సొంతింటి కల నెరవేరుతుందని మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి తోటకూర…
This website uses cookies.