Hyper Aadi : ఫన్ అంతా షన్నుకే ఇచ్చావ్.. సిరిపై హైపర్ ఆది నాటీ కామెంట్స్

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 19 September 2022, 12:00 pm

Hyper Aadi : బిగ్ బాస్ ఇంట్లో షన్ను సిరి చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరూ వారి ట్రాక్‌ను చీదరించుకున్నారు. దారుణంగా ట్రోల్స్ చేశారు. ఆ హగ్గులు, ముద్దులు చూసి అసహ్యించుకున్నారు. చివరకు సిరి తల్లి ఎంతో ప్రేమగా చెప్పినా కూడా వినలేదు. అమ్మనే కసురుకుంది. మళ్లీ వెంటనే షన్నుకి హగ్గులు ఇచ్చింది. అలా సొంత అమ్మే చెప్పినా కూడా సిరి మాత్రం మారలేదు. షన్నుతో రొమాన్స్ చేయకుండా ఆగలేదు. ఆ రొమాన్స్ వల్ల షన్ను లైఫ్ మొత్తం మారిపోయింది.

బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసిన పనుల వల్ల షన్నుకి దీప్తి సునయన బ్రేకప్ చెప్పేసింది. అలా షన్ను ఒంటరి వాడయ్యాడు. శ్రీహాన్ సైతం సిరికి దూరంగా ఉంటున్నాడనే వార్తలువచ్చాయి. కానీ చివరకు సిరి శ్రీహాన్ ఒక్కటయ్యారు. అయితే తాజాగా సిరి మీద ఆది డబుల్ మీనింగ్ డైలాగ్ వేశాడు. దసరా ఈవెంట్ కోసం సిరి ఈటీవీ మల్లెమాల షోకు వచ్చింది. ధమాకా అంటూ రాబోతోన్న ఈ ఈవెంట్‌లో సిరి వచ్చింది. రెండ్రోజులు అయింది.. బోర్ కొడుతోంది అంటూ సిరి అంటుంది.

hyper Aadi Satires on Siri Shannu in Bigg Boss

hyper Aadi Satires on Siri Shannu in Bigg Boss

రెండు రోజులకే ఈ ఇళ్లు బోర్ కొడితే.. వంద రోజులు ఆ ఇంట్లో ఎలా ఉన్నావ్ అంటూ ఆది కౌంటర్ వేస్తాడు. నేను అందరికీ ఫన్ ఇచ్చాను కదా? అని సిరి అంటే.. ఫన్ అంతా కూడా షన్నుకి ఇచ్చావ్ మాకు ఎక్కడ ఇచ్చావ్ అంటూ దారుణంగా పరువుతీసేస్తాడు హైపర్ ఆది.ఆ దెబ్బతో సిరి మొహం మాడిపోయినట్టు అయింది. ఇంకో మాట మాట్లాడకుండా పక్కకి వెళ్లిపోయింది. ఇలాంటి డబుల్ మీనింగ్ పంచ్‌లు వేయాలంటే ఆది తరువాత ఎవరైనా. ట్రెండింగ్ టాపిక్‌లను పట్టుకుని మరీ కౌంటర్లు వేస్తుంటాడు.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి