Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ రష్మీ జోడిని మరోసారి టార్గెట్ చేసిన ఆది.. నాటి విషయాలు మళ్లీ తవ్వేశాడు

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 2, 2022, 9:00 pm

బుల్లితెరపై సుడిగాలి సుధీర్ రష్మి గౌతమ్ జోడికి ఓ స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. గత తొమ్మిదేళ్లుగా ఈ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ పెరుగుతూ వచ్చింది. ఇంకా ఈ ఇద్దరి జోడి మీద ప్రేక్షకులు ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. అయితే ఈ జోడి ఇప్పుడు వృత్తిపరంగా విడిపోయింది. ఇప్పుడు సుధీర్ స్టార్ మాకు వెళ్లిపోయాడు.. రష్మీ ఏమో మల్లెమాల టీంలోనే ఉంది. మొత్తానికి ఇప్పుడు ఈ ఇద్దరూ విడిపోయే పరిస్థితి వచ్చేసింది. కానీ మళ్లీ రష్మీ కూడా స్టార్ మాలోనే జంప్ అయ్యేట్టు కనిపిస్తోంది. అయితే సుధీర్ అక్కడకు వెళ్లినా కూడా రష్మీని మాత్రం వదలడం లేదు. హైపర్ ఆది ప్రతీ సారి బాబూ బాబూ అంటూ రష్మీని ఏడిపిస్తూనే ఉన్నాడు.

సుధీర్ టాపిక్ ఇండైరెక్ట్‌గా తీస్తూనే ఉన్నాడు. ఒక వేళ నిజంగానే సుదీర్, మల్లెమాల టీంకు గొడవలు జరిగి ఉంటే.. ఇలా సుధీర్ పేరును పదే పదే వాడుకునేందుకు అనుమతి ఇచ్చేవారా? అన్నది డౌటే. అయితే సుధీర్ వెళ్లిపోయినా కూడా మల్లెమాల టీం, శ్రీదేవీ డ్రామా కంపెనీ వాళ్లు మాత్రం అతని జపమే చేస్తోన్నట్టు కనిపిస్తోంది. సుధీర్ రష్మీ జోడి బుల్లితెరపై ఎన్ని వేషాలు వేశారో అందరికీ తెలిసిందే. అదంతా కూడా డైరెక్షన్ టీం కాన్సెప్ట్ అయినా కూడా ఈ ఇద్దరూ మాత్రం బాగానే జీవించేశారు. ఈ ఇద్దరు నిశ్చితార్థం, పెళ్లి ఈవెంట్లు ఎన్నిసార్లు బుల్లితెరపై నడిపించేశారో అందరికీ తెలిసిందే.

Hyper Aadi Satires on Sudigali Sudheer on Rashmi in Sridevi Drama Company

Hyper Aadi Satires on Sudigali Sudheer on Rashmi in Sridevi Drama Company

అయితే ఈ జోడి మీద ప్రతీసారి హైపర్ ఆది ఏదో ఒక పంచులు వేస్తుంటాడు.  తాజాగా వదిలిన శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రోమోలో రెచ్చిపోయాడు ఆది. సుధీర్‌ను జోలిని మళ్లీ తీశాడు. రష్మీ మీద సెటైర్లు వేశాడు. సుధీర్‌కి రష్మీ తొమ్మిదేళ్ల బంధానికి ప్రతీకగా.. తొమ్మిది గిఫ్టులు ఇచ్చిన స్కిట్ మీద కౌంటర్ వేశాడు. కరెక్ట్‌గా మీ ఇద్దరూ తొమ్మిదేళ్లు ఉంటే.. మీకే నిశ్చితార్థం, పెళ్లి అంటూ తొంభై గిఫ్టులు వచ్చేవి అంటూ సుధీర్, రష్మీ మీద సెటైర్లు వేశాడు ఆది. ఇక ఆది వరుసగా సుధీర్, రష్మీ వేసిన స్కిట్ల గురించి కౌంటర్లు వేస్తూ వచ్చాడు. దీంతో రష్మీ తెగ సిగ్గుపడిపోయింది.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp