Home » Entertainment » Hyper Aadi Satires On Varsha And Bhanu Remunerations In Sridevi Drama Company
Entertainment

Hyper Aadi : వర్ష, భానుల రెమ్యూనరేషన్.. దారుణంగా కించపరిచిన హైపర్ ఆది

Authored By
aruna
The Telugu News | Updated on: August 2, 2022 12:29 pm
Advertisement

Hyper Aadi : బుల్లితెరపై రెమ్యూనరేషన్‌లు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే ఉంటాయి. సీరియల్స్ కంటే.. ఎంటర్టైన్మెంట్ షోల్లోనే ఎక్కువగా ఆదాయం వస్తుంటుంది. అందుకే సీరియల్ నటీనటులు అప్పుడప్పుడు నవ్వించే షోలకు వస్తారు. సంపాదించుకుని వెళ్తారు. ఈవెంట్‌కు ఇంత అని ఉంటుంది. అయితే జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవీ డ్రామా కంపెనీ, ఢీ వంటి వాటిలో మంచి రెమ్యూనరేషన్ ఉంటుందని తెలుస్తోంది. అయితే ఆది మాత్రం అప్పుడప్పుడు రెమ్యూనరేషన్‌ల మీద కౌంటర్లు వేస్తుంటాడు. తాజాగా జరిగిన శ్రీదేవీ డ్రామా కంపెనీలో ఎపిసోడ్‌లో ఆది రెచ్చిపోయాడు. బోనాల జాతర అంటూ జరిగిన ఎపిసోడ్‌లో మధుప్రియ ఫ్యామిలీ, కనకవ్వ వచ్చింది. కనకవ్వతో ఆది మంచి ఫన్ క్రియేట్ చేశాడు.

Advertisement

కనకవ్వ ఇటు రా వీళ్లను (వర్ష, భానులు) ఎక్కడైనా చూశావా? అని అడుగుతాడు ఆది. అవును చూశాను కదా? మొన్నే పత్తి ఏరడానికి మా ఊరికి వచ్చారు అని పరువుతీస్తుంది కనకవ్వ. దీంతో వారిద్దరి మొహాలు మాడిపోతాయి. వాళ్లు చూడటానికి పత్తి ఏరడానికి వచ్చిన వాళ్లలా ఉంటారు కానీ కాదు అని కౌంటర్ వేస్తాడు ఆది. వాళ్లు ఆర్టిస్ట్‌లు రెండు వేలు, రెండొందలకు వస్తుంటారు.. ఆమెకు (వర్షకు) రెండు వేలు ఇస్తే చాలు వస్తుంది.. ఈమెకు (భానుకు) రెండొందలు, రెండు పూటల భోజనం పెడితే చాలు వస్తుంది అని పరువుతీస్తాడు హైపర్ ఆది. తన మీద అలా కౌంటర్లు వేయడంతో హైపర్ ఆదిని పక్కకు తోసేస్తుంది భాను. ఆది కాస్త కామెడీ చేసేందుకు అలా కించపరుస్తుంటాడు.

Hyper Aadi Satires on Varsha And Bhanu Remunerations in Sridevi Drama Company

Advertisement

అయితే నిజంగానే వారి రెమ్యూనరేషన్‌లు అందరి కంటే తక్కువగా ఉంటున్నట్టు కనిపిస్తోంది. అందుకే పదే పదే ఇలా వారి రెమ్యూనరేషన్‌ల మీద కౌంటర్లు వేస్తుంటాడని తెలుస్తోంది. ఇక ఆది, రాం ప్రసాద్‌ల రెమ్యూనరేషన్‌లే అత్యధికం అని తెలుస్తోంది. శ్రీదేవీ డ్రామా కంపెనీలో వారి రెమ్యూనరేషన్ ఎక్కువ అని.. ఆ తరువాత ఎవరి రెమ్యూనరేషన్‌లైనా ఉంటాయని టాక్. ఇక ఇప్పుడు సుధీర్ లేకపోవడంతో అంతా వారిద్దరే చూసుకుంటూ ఉండటంతో రెమ్యూనరేషన్ కూడా అధికంగా వస్తోందని టాక్.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి