Hyper Aadi : సీరియల్ నటితో ముద్దు కోసం ప్రయత్నం.. రెచ్చిపోయిన హైపర్ ఆది | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : సీరియల్ నటితో ముద్దు కోసం ప్రయత్నం.. రెచ్చిపోయిన హైపర్ ఆది

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే స్కిట్లు, పేల్చే పంచులు, ఎదుటివారిని కించపరుస్తూ రాసే డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన పెళ్లి విషయం వచ్చే సరికి స్కిట్లో కాస్త తేడాల ప్రవర్తిస్తాడు. మొత్తానికి ఆది మాత్రం ఈ మధ్య రొమాంటిక్ స్కిట్ల మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే తన స్కిట్లో ఎప్పుడూ కొత్త కొత్త అమ్మాయిలను పట్టుకొస్తాడు.తాజాగా ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెచ్చిపోయాడు. వచ్చే ఆదివారం రాబోతోన్న […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 April 2022,9:00 pm

Hyper Aadi : బుల్లితెరపై హైపర్ ఆది వేసే స్కిట్లు, పేల్చే పంచులు, ఎదుటివారిని కించపరుస్తూ రాసే డైలాగ్స్ ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. తన పెళ్లి విషయం వచ్చే సరికి స్కిట్లో కాస్త తేడాల ప్రవర్తిస్తాడు. మొత్తానికి ఆది మాత్రం ఈ మధ్య రొమాంటిక్ స్కిట్ల మీద బాగానే ఫోకస్ పెట్టేసినట్టు కనిపిస్తోంది. మామూలుగానే తన స్కిట్లో ఎప్పుడూ కొత్త కొత్త అమ్మాయిలను పట్టుకొస్తాడు.తాజాగా ఆది శ్రీదేవీ డ్రామా కంపెనీలో రెచ్చిపోయాడు.

వచ్చే ఆదివారం రాబోతోన్న ఈ ఎపిసోడ్ థీమ్ అదిరిపోయింది. సీరియల్స్‌లో ఎవరు గొప్ప.. హీరో గొప్పా? హీరోయిన్ గొప్పా? అనే థీమ్ మీద ముందుకు వచ్చింది. దీంతో బుల్లితెర తారలు ఈ శ్రీదేవీ డ్రామా కంపెనీ షోకు వచ్చేశారు. వారితో పాటుగా న్యాయ నిర్ణేత స్థానంలో నాటి హీరో రోహిత్ వచ్చేశాడు. ఇక ఇందులో భాగంగా ఆది రెచ్చిపోయాడు.సీరియల్ షూటింగ్ అని ఓ స్కిట్ వేశారు. ఇందులో భాస్కర్ దర్శకుడిగా నటించాడు. ఓ సీరియల్ నటితో ఆది కూడా నటించేశాడు. హీరోగా ఆది చేశాడు. ఆదికి యాక్సిడెంట్ అవుతుంది.

Hyper Aadi Serial Skit In Sridevi Drama Company

Hyper Aadi Serial Skit In Sridevi Drama Company

సీరియల్ నటి ఒళ్లో తల పెట్టుకుని ఆది అలా పడుకుంటాడు. ఆమె తెగ నటిస్తూ ఏడ్చేస్తుంటుంది. ఆ మధ్య తల నొప్పి అంటే ఇలానే ఒళ్లో పెట్టుకుని ముద్దు పెట్టావ్.. దెబ్బకు నొప్పి తగ్గింది.. ఇప్పుడు కూడా పెట్టు అని ఆది అంటాడు.ఇంతలో భాస్కర్ వచ్చేసి.. యాక్సిడెంట్ జరిగితే ఎవరైనా ముద్దు పెడతారా? అని కౌంటర్ వేస్తాడు. ఇలానే కొద్ది సేపు ఒళ్లో ఉందాం.. బాగుంది అంటూ ఆది రెచ్చిపోతాడు. మొత్తానికి వీరి స్కిట్ మాత్రం అదిరిపోయేలా ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది