Hyper Aadi : హైపర్ ఆది మరీ ఇంత చిల్లరగా తయారు అయ్యాడేంట్రా బాబు! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : హైపర్ ఆది మరీ ఇంత చిల్లరగా తయారు అయ్యాడేంట్రా బాబు!

Hyper Aadi : శ్రీదేవి డ్రామా కంపెనీ లో హైపర్ ఆది స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రాంప్రసాద్ తో కలిసి చేసే కామెడీ కోసమే చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని చూస్తారు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన కామెడీ పేరుతో కొన్నిసార్లు జుగుత్సాకరమైన కామెంట్స్ ని ఆడ వారిపై చేయడం చాలా సార్లు మనం చూసాం. వచ్చేవారం ఎపిసోడ్‌ లో కూడా ఆయన అదే రకమైన కామెంట్స్ చేయబోతున్నాడు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 September 2022,1:00 pm

Hyper Aadi : శ్రీదేవి డ్రామా కంపెనీ లో హైపర్ ఆది స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన రాంప్రసాద్ తో కలిసి చేసే కామెడీ కోసమే చాలా మంది శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని చూస్తారు. అందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఆయన కామెడీ పేరుతో కొన్నిసార్లు జుగుత్సాకరమైన కామెంట్స్ ని ఆడ వారిపై చేయడం చాలా సార్లు మనం చూసాం. వచ్చేవారం ఎపిసోడ్‌ లో కూడా ఆయన అదే రకమైన కామెంట్స్ చేయబోతున్నాడు అని ప్రోమో చూస్తే అర్థం అవుతోంది. వివరాల్లోకి వెళితే అమ్మాయిలని ఎత్తుకొని అబ్బాయిలు కుర్చీ ఆట ఆడాల్సి ఉంది. ఆట సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ ప్రతివారం ఇలాంటి ఒక ఆట ఉంటే బాగుంటుంది కదా అంటూ అమ్మాయిలను కించపరిచే విధంగా మాట్లాడాడు అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆడవాళ్లు అంటే అంత చులకనగా చూసే హైపర్ ఆది గతంలో కూడా పలు సార్లు ఇలాంటి చెత్త కామెంట్స్ చేశాడంటూ సోషల్ మీడియా ద్వారా కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కామెడీ కోసం ఏం అన్నా కూడా నడిచి పోతుంది అని ఆయన భావిస్తున్నాడేమో కానీ కొందరు ఆ విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారనే విషయం అతడికి తెలియదు. ముందు ముందు కచ్చితంగా మహిళలను కించపరిచినందుకు హైపర్ ఆదికి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరిస్తున్నారు. ఆడవారిని ఇష్టానుసారంగా కామెంట్స్ చేయడం సీనియర్లు అనే గౌరవం లేకుండా అన్నపూర్ణమ్మ, మలక్ పేట శైలజ వంటి సినీయర్స్ ని ఏక వచనంతో వారిని అవమానకరంగా మాట్లాడడం చేస్తున్నాడు.

Hyper Aadi social media trolls goes viral

Hyper Aadi social media trolls goes viral

హైపర్ ఆది ఎక్కువ శాతం ఆడవారిపై వేసే పంచ్ లు సక్సెస్ అయ్యి నవ్వు తెప్పిస్తున్నాయి. అందుకే ఆయన మళ్లీ మళ్లీ ఆడవారిపైనే పంచ్ వేస్తాడు. వర్ష ని ఏ స్థాయిలో హైపర్ ఆది ఆడుకుంటాడు అందరికీ తెలిసిందే అతడి యొక్క పంచ్ లకు వర్ష కొన్ని సార్లు ఆవేదన వ్యక్తం చేసింది. బయటకు చెప్పకుండా కూడా ఆమె మనసు తీవ్రంగా క్షోభించి ఉంటుంది. అందుకే ఇప్పటికైనా హైపర్ ఆది ఆడవాళ్ళ విషయంలో పంచులు వేయడం మాని వేయాలంటూ ఆయన అభిమానులు స్వయంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈవారం నుండి జబర్దస్త్ కార్యక్రమంలో హైపర్ ఆది హడావుడి కనిపించబోతుంది. కనుక జబర్దస్త్ లో కూడా ఆడవారిపై పంచ్ లు వేయకుండా కామెడీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది