Sudigali Sudheer : హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను…. ఈ సైలెన్స్ బ్రేక్‌ అయ్యేది ఎప్పుడు గురూ?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 7, 2022, 6:00 pm

Sudigali Sudheer : తెలుగు బుల్లి తెరపై తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్ టైన్ మెంట్ చేసిన జబర్దస్త్ ఈ మధ్య కాలంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జబర్దస్త్ స్టార్ కమెడియన్ లుగా పేరు దక్కించుకున్న హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ మరియు గెటప్ శ్రీను వీళ్ళందరూ కూడా జబర్దస్త్ వీడి వెళ్లి పోయారు. వీరు జబర్దస్త్ వదిలి వెళ్లి పోవడానికి కారణం ఏంటి అనే విషయంలో ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కానీ ఇటీవల జబర్దస్త్ ఎపిసోడ్ చూసిన వారెవరికైనా వీరు ఇక ఈటీవీలో కనిపించరు అని క్లారిటీ వచ్చేసింది.

జబర్దస్త్ నుండి సుధీర్ వెళ్లిపోయిన క్రమం చూపిస్తూ ఒక కామెడీ స్కిట్ ని కూడా పండించే ప్రయత్నం చేశారు. ఆ స్కిట్టు నవ్వులు పూయించలేదు కాని అందరికీ కన్నీళ్లు పెట్టించింది. ఆ విషయం పక్కన పెడితే సుధీర్ మరియు రాంప్రసాద్ మళ్ళీ కలిసి ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం లో సందడి చేస్తారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. కానీ ఇప్పటికే సుధీర్ ఈటీవీకి చాలా దూరం అయ్యాడు అనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీ లో అడుగు పెట్టి సక్సెస్ అవ్వాలని ఎదురు చూస్తున్న సుధీర్‌ కు ఈ మధ్య వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. మరో వైపు స్టార్ మా వారు కూడా సుధీర్ కి మంచి ప్యాకేజీ ప్రకటించడం జరిగిందట.దాంతో సుధీర్ మరియు ఇతర కమెడియన్స్ వరుసగా అటువైపు వెళ్ళారు అంటూ టాక్ వినిపిస్తుంది.

hyper aadi, sudigali sudheer and other comedians out from jabardasth

hyper aadi, sudigali sudheer and other comedians out from jabardasth

ఈ టీవీ మల్లెమాల వారితో అసలు ఏం గొడవ జరిగింది అనేది క్లారిటీ రాలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పారితోషికంలో వ్యత్యాసం కారణంగానే సుధీర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అంటున్నారు. సుధీర్ మాత్రమే కాకుండా ఇంకా పలువురు కూడా జబర్దస్త్ నుండి వెళ్ళిపోవడానికి కారణం చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఆ కారణం వారు ఎప్పుడు ఎప్పుడు చెప్తారా అంటూ వారి అభిమానులు మరియు జబర్దస్త్ యొక్క ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సుధీర్ మరియు హైపర్ ఆది లు వారి యొక్క సైలెన్స్ ను ఎప్పుడు బ్రేక్‌ చేస్తారో… వారు నోరు తెరిచే ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp