Hyper Aadi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపుల‌కి దిగుతున్న హైప‌ర్ ఆది..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 June 2024, 8:30 pm
  •  Hyper Aadi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపుల‌కి దిగుతున్న హైప‌ర్ ఆది

Hyper Aadi : పవ‌న్ క‌ళ్యాణ్ వీర భ‌క్తుడిగా హైప‌ర్ ఆదికి పేరుంది. ఆయ‌న మొన్న జ‌రిగిన ఎన్నిక‌ల‌లో ప‌వ‌న్ కోసం పిఠాపురం వెళ్లి అక్క‌డ కొన్ని రోజుల పాటు ఉండి ప్ర‌చారం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే నేను రియాక్ట్ అవుతా. నాకు అన్ని విషయాల్లో ప్రేరణ పవన్ కళ్యాణ్ గారు. ఉన్నత వ్యక్తిత్వం ఉన్న ఆయన్ని ఎవరైనా ఏమైనా అంటే నాకు కోపం వస్తుంది. వ్యక్తిగతంగా ఎవరికీ శత్రువులు ఉండరు. పవన్ కళ్యాణ్ గారు కూడా సమస్యపై మాట్లాడతారు తప్పితే.. వ్యక్తిగతంగా దూషించరు. ఆయన ఎవర్నీ ఏమీ అనరు.. కేవలం సమస్యపై మాట్లాడతారు. ఆయన బాటలో ప్రయాణించే మేము కూడా అంతే ఎవర్నీ వ్యక్తిగతంగా విమర్శించము అంటూ ప‌వ‌న్‌పై త‌నకు ఉన్న అభిమానాన్ని ప్ర‌ద‌ర్శించారు.

Hyper Aadi హైప‌ర్ ఆది బెదిరింపులు..

అయితే తాజాగా హైప‌ర్ ఆది పిఠాపురం ఎమ్మెల్యే తాలూకు అని బెదిరించ‌డం చ‌ర్చనీయాంశం అయింది. వివ‌రాల‌లోకి వెళితే తాజాగా ఢీ షో ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో హైపర్ ఆది చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వేదికగా వైరల్ అవుతుండటం గమనార్హం. బంతి భోజనాలకు కూర్చున్నట్టు కూర్చున్నారు అందరూ” అని చెప్పగా పండు “ఏంటి నువ్వు కూడా ఛాలెంజ్ మరిచిపోయావా వాళ్లు వచ్చి కూర్చోవాలి మనం గెలిచాం లాస్ట్ రౌండ్” అని చెబుతాడు.హైపర్ ఆది వెంటనే “ఆడవాళ్లు గుళ్లో కూర్చోవాలి కానీ ఒళ్లో కూర్చోవడం ఏంట్రా సిగ్గు లేదా మీకు” అంటూ హైపర్ ఆది రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత హైపర్ ఆది “నువ్వు ఎలా కూర్చున్నావో తెలుసా.

Hyper Aadi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపుల‌కి దిగుతున్న హైప‌ర్ ఆది..!

Hyper Aadi : ప‌వ‌న్ క‌ళ్యాణ్ పేరు చెప్పి బెదిరింపుల‌కి దిగుతున్న హైప‌ర్ ఆది..!

ఫ్యామిలీ ప్లాన్ ఆపరేషన్ అయ్యాక ఆరెంజ్ జ్యూస్ 500 రూపాయల కోసం కూర్చున్నట్టు కూర్చున్నావ్” అని పంచ్ వేయగా ఆ పంచ్ ఆకట్టుకుంది.ఆ తర్వాత పండు\ “నువ్వెన్ని చెప్పినా ఈరోజు తగ్గేది లేదు.అడ్డొస్తే తొక్కి పడేస్తా” అని చెప్పగా హైపర్ ఆది వెంటనే “మనం ఎవరి తాలూకానో తెలుసా నీకు పిఠాపురం గుర్తుందా” అని కామెంట్లు చేశారు. ఈ నెల 26వ తేదీన ఫుల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఈ షోకు బుల్లితెరపై మంచి రేటింగ్స్ వస్తున్నాయి.ఢీ షోకు హన్సిక జడ్జిగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ షో చూడటానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.ఢీ షో బుల్లితెర డ్యాన్స్ షోలలో స్పెషల్ షోగా నిలిచి అందరినీ ఆకట్టుకుంటోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి