Hyper Aadi : కరోనా సమయంలో ప్రతి ఒక్కరు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. అలాంటి టైంలో కూడా అందర్నీ నవ్వించిన వీడియో ఏంటి అంటే ఓలేటి లక్ష్మి వీడియో అనే చెప్పాలి. నిజానికైతే ఇది వీడియో కాదు ఇది ఒక ఆడియో మాత్రమే. అయితే ఆ ఆడియో కి యానిమేషన్స్ చేసి వీడియో లాగా తయారు చేశారు. ఇంకా ఈ వీడియో కేవలం కరోనా టైం లోనే కాకుండా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఓలేటి లక్ష్మి అనే ఆమెకు కరోనా వచ్చిందని తెలియజేసేందుకు కలెక్టర్ ఆఫీస్ నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చేసి ఆమెతో మాట్లాడిన సంభాషణ నవ్వులను పూయించాయి.
ఆమె అమాయకత్వంతో తెలియనితనం తో చెప్పిన సమాధానాలు అలాగే ఆమె మాట్లాడకుండా పక్కన ఉన్న వారికి ఫోన్ ఇవ్వడంతో హెల్త్ ఇన్స్పెక్టర్ అసహనానికి గురై కర్మ కొద్ది దొరుకుతారు జనాలు మీ దుంపలు తెగ , మీరెక్కడ తయారయ్యారు రా బాబు , అంటూ మాట్లాడుతాడు.ఇక ఈ ఆడియో రికార్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. అయితే ఈ ఆడియో ఆధారంగా జబర్దస్త్ లోని రాకెట్ రాఘవ ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ స్కిట్ విపరీతంగా ప్రజాధరణ పొందింది. దీంతో ఈ ఆడియో మరింత పాపులర్ అయింది. అయితే ఆడియో వీడియో అయితే క్లిక్ అయ్యాయి కానీ అసలు మాట్లాడిన ఆ మనిషి ఎవరో అన్నది ఎవరికీ తెలియదు.
దీంతో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఒక ఆమెను తీసుకొచ్చి ఓలేటి లక్ష్మి అంటే ఈమె అని చెప్పారు. అయితే నిజానికి ఆమె ఓలేటి లక్ష్మి కాదు. రేటింగ్ కోసం ఎవర్నో తీసుకువచ్చి మధ్య పెట్టె ప్రయత్నం చేశారు షో నిర్వాహకులు కానీ ఆమె ఓలేటి లక్ష్మి కాదు. అప్పట్లో ఈ వీడియో వైర్లు అవడంతో టీవీ చానల్స్ వారు లక్ష్మీ ఇంటి ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. వారిది కృష్ణా జిల్లా అని ఒకరోజు అర్ధరాత్రి 12.30 నిమిషాలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఆ టైంలో ఫోన్ రావడం వల్ల మేమంతా భయపడిపోయామని, అందుకే హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పిందానికి మేము సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయామని చెప్పింది. ఆ తర్వాత పాజిటివ్ అని తెలుసుకున్నాక మేమంతా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందామని వెల్లడించింది.
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
TTD : టీటీడీలో ఉద్యోగాల కోసం కొంత మంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే…
Elon Musk : టెస్లా అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ భారతదేశం ఓట్ల-లెక్కింపు ప్రక్రియ యొక్క సామర్థ్యాన్ని ప్రశంసించారు. ఆదివారం…
This website uses cookies.