Hyper Aadi : అందరినీ మోసం చేసిన హైపర్ ఆది.. టీవీ లో చూసినవాళ్లు తెగ తిడుతున్నారు ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hyper Aadi : అందరినీ మోసం చేసిన హైపర్ ఆది.. టీవీ లో చూసినవాళ్లు తెగ తిడుతున్నారు !

Hyper Aadi : కరోనా సమయంలో ప్రతి ఒక్కరు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. అలాంటి టైంలో కూడా అందర్నీ నవ్వించిన వీడియో ఏంటి అంటే ఓలేటి లక్ష్మి వీడియో అనే చెప్పాలి. నిజానికైతే ఇది వీడియో కాదు ఇది ఒక ఆడియో మాత్రమే. అయితే ఆ ఆడియో కి యానిమేషన్స్ చేసి వీడియో లాగా తయారు చేశారు. ఇంకా ఈ వీడియో కేవలం కరోనా టైం లోనే కాకుండా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఓలేటి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 December 2022,10:00 am

Hyper Aadi : కరోనా సమయంలో ప్రతి ఒక్కరు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొన్నారు. అలాంటి టైంలో కూడా అందర్నీ నవ్వించిన వీడియో ఏంటి అంటే ఓలేటి లక్ష్మి వీడియో అనే చెప్పాలి. నిజానికైతే ఇది వీడియో కాదు ఇది ఒక ఆడియో మాత్రమే. అయితే ఆ ఆడియో కి యానిమేషన్స్ చేసి వీడియో లాగా తయారు చేశారు. ఇంకా ఈ వీడియో కేవలం కరోనా టైం లోనే కాకుండా ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. ఓలేటి లక్ష్మి అనే ఆమెకు కరోనా వచ్చిందని తెలియజేసేందుకు కలెక్టర్ ఆఫీస్ నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి చేసి ఆమెతో మాట్లాడిన సంభాషణ నవ్వులను పూయించాయి.

ఆమె అమాయకత్వంతో తెలియనితనం తో చెప్పిన సమాధానాలు అలాగే ఆమె మాట్లాడకుండా పక్కన ఉన్న వారికి ఫోన్ ఇవ్వడంతో హెల్త్ ఇన్స్పెక్టర్ అసహనానికి గురై కర్మ కొద్ది దొరుకుతారు జనాలు మీ దుంపలు తెగ , మీరెక్కడ తయారయ్యారు రా బాబు , అంటూ మాట్లాడుతాడు.ఇక ఈ ఆడియో రికార్డింగ్ అప్పట్లో సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారింది. అయితే ఈ ఆడియో ఆధారంగా జబర్దస్త్ లోని రాకెట్ రాఘవ ఒక స్కిట్ కూడా చేయడం జరిగింది. ఇక ఆ స్కిట్ విపరీతంగా ప్రజాధరణ పొందింది. దీంతో ఈ ఆడియో మరింత పాపులర్ అయింది. అయితే ఆడియో వీడియో అయితే క్లిక్ అయ్యాయి కానీ అసలు మాట్లాడిన ఆ మనిషి ఎవరో అన్నది ఎవరికీ తెలియదు.

Hyper Adi who cheated everyone

Hyper Adi who cheated everyone

దీంతో తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ వారు ఒక ఆమెను తీసుకొచ్చి ఓలేటి లక్ష్మి అంటే ఈమె అని చెప్పారు. అయితే నిజానికి ఆమె ఓలేటి లక్ష్మి కాదు. రేటింగ్ కోసం ఎవర్నో తీసుకువచ్చి మధ్య పెట్టె ప్రయత్నం చేశారు షో నిర్వాహకులు కానీ ఆమె ఓలేటి లక్ష్మి కాదు. అప్పట్లో ఈ వీడియో వైర్లు అవడంతో టీవీ చానల్స్ వారు లక్ష్మీ ఇంటి ముందు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ.. వారిది కృష్ణా జిల్లా అని ఒకరోజు అర్ధరాత్రి 12.30 నిమిషాలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని ఆ టైంలో ఫోన్ రావడం వల్ల మేమంతా భయపడిపోయామని, అందుకే హెల్త్ ఇన్స్పెక్టర్ చెప్పిందానికి మేము సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయామని చెప్పింది. ఆ తర్వాత పాజిటివ్ అని తెలుసుకున్నాక మేమంతా ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందామని వెల్లడించింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది