Home » Entertainment » I Am Lucky To Do Such A Prostitute Role Anasuya Key Comments Video Viral
Entertainment

Anasuya : ఇటువంటి వేశ్య పాత్రలో చేయడం నా అదృష్టం అనసూయ కీలక వ్యాఖ్యలు వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 9, 2023, 2:00 pm
Advertisement

Anasuya : పట్టిందల్లా బంగారం అన్నట్టు యాంకర్ అనసూయ ఏ రంగంలో అడుగుపెట్టిన క్లిక్ అయిపోతుంది. సాధారణంగా యాంకరింగ్ రంగంలో కుర్ర యాంకర్ల్ కి ఎక్కువ గిరాకీ ఉంటది కానీ అనసూయ పెళ్లయినా గాని…. లేత కుర్ర యాంకర్లకు పోటీ ఇచ్చి వెనక్కి తన్ని.. తిరుగులేని యాంకర్ అనిపించుకుంది. అంత మాత్రమే కాదు ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుని ఇప్పుడు.. మంచి మంచి పాత్రలు అందుకుంటూ ఉంది. ఇదే సమయంలో వెబ్ సిరీస్ లో కూడా అవకాశాలు అందుకుంటుంది.

Advertisement

ఈ రకంగా అనసూయ పట్టిందల్లా బంగారమైపోతుంది. దీంతో పెళ్లయి పిల్లలు ఉన్నాగాని రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక షోరూం ఓపెనింగ్ కార్యక్రమాలకు హీరోయిన్ల కంటే అనసూయకే ఎక్కువ గిరాకీ పెరిగింది. ఎందుకంటే ఆమె ఎక్కువ షోరూంలు ఓపెనింగ్ చేస్తూ ఉంది. ఇదంతా పక్కన పెడితే తమిళంలో వేశ్యగా అనసూయ ప్రభుదేవాతో నటించినట్లు తాజాగా తన “విమానం” అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదే రీతిలో “విమానం” సినిమాలో కూడా.. వేశ్యపాత్ర ఆ తరహాలోనే… అంత దగ్గరగా తన పాత్ర ఉంటుందని అనసూయ కీలక వ్యాఖ్యలు చేసింది.

i am lucky to do such a role anasuya key comments video viral

Advertisement

అయితే అంతకుముందే తమిళంలో ఈ తరహా పాత్ర చేయడంతో.. మొదట “విమానం”లో తన పాత్ర గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు చాలా ఆలోచించడం జరిగింది. అయితే కథలో పాత్ర చాలా డిమాండ్ చేస్తూ ఉండటంతో అదృష్టంగా భావించే సినిమా చేసినట్లు అనసూయ స్పష్టం చేయడం జరిగింది. అన్నిటికీ మించి పాత్రలు, హీరోల కంటే సినిమాయే అతి పెద్ద హీరో. ఒప్పుకునే సినిమాలలో మొదటిగా ప్రేక్షకుడిగా ఆలోచించిన తర్వాతే ఏ పాత్రనైనా ఓకే చేస్తాను అని “విమానం” సినిమాలో తన పాత్ర గురించి అనసూయ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి