
Samantha : కష్టాలను దగ్గర ఉండి చూసా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
Samantha : ఎన్నో సంవత్సరాలుగా హీరోయిన్‌గా కొనసాగుతూ ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆమె నిర్మించిన ‘శుభం’ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీనికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకుడు. మరో రెండు రోజుల్లో మూవీ విడుదల కానున్న నేపథ్యంలో సమంత మీడియాతో ముచ్చటించింది. నటిగా, నిర్మాతగా తన కష్టసుఖాలు, అనుభవాలను పంచుకుంది. ‘ప్రతి శుక్రవారం ఎలా ఉంటుందో నటిగా నాకు చాలా అనుభవం ఉంది. కానీ నిర్మాతగా ఇది నాకు మొదటి శుక్రవారం. చాలా నర్వెస్‌గా ఉంది. నిర్మాతకు ఎన్ని కష్టాలు ఉంటాయో నేను నిర్మాత అయితే గానీ తెలియలేదు. ‘శుభం’ సినిమా నాకు చాలా నచ్చింది. మంచి కథతో రావడంతో రిజల్ట్‌పై నాకు నమ్మకముంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో కొద్దిరోజులుగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పోస్ట్ ప్రొడక్షన్, మిక్సింగ్, ఎడిటింగ్.. ఇలా అన్ని టీమ్‌లది అదే పరిస్థితి. అందుకే అందరి మీద నాకు గౌరవం పెరిగింది’
Samantha : కష్టాలను దగ్గర ఉండి చూసా.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
‘నటిగా ఎంతో చూశాను. ఎన్నో లక్షల మంది అభిమానం దక్కింది. అయినా ఇంకా ఏదో చేయాలన్న కోరిక కలిగింది. నేను బ్రేక్ తీసుకున్న టైమ్‌లో సినిమాలు చేయలేకపోయాను. ఇక సినిమాల్లో నటిస్తానో లేదో కూడా తెలియని సమయంలో నిర్మాతగా మారాలనే ఆలోచన వచ్చింది. సినిమాల్లో నటించకపోయినా సినిమాలు నిర్మించవచ్చు కదా అని నిర్ణయించుకున్నారు. కెరీర్ మొదలుపెట్టి 15 ఏళ్లయింది.. ఇంత అనుభవం ఉంది కదా అన్న ఆలోచనతో ప్రొడక్షన్ హౌస్ మొదలుపెట్టాను. ఎలాంటి హడావుడి లేకుండా 8 నెలల్లోనే చిత్రాన్ని పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఈ సినిమాలో ఎక్కువగా సీరియల్ గురించే ఉంటుంది. ఆ సీరియల్‌కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా? అని అంతా ఎదురుచూస్తుంటారు కాబట్టి ‘శుభం’ అనే టైటిల్ పెట్టాం. చిన్నప్పుడు ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ద రెయిన్’ అనే పద్యం గుర్తుండటంతో నా ప్రొడక్షన్ కంపెనీకి ‘ట్రాలాలా’ అని పేరు పెట్టాం. కొత్త అమ్మాయినైన నాకు గౌతమ్ మీనన్ ఛాన్స్ ఇవ్వడంతోనే ఇంత పెద్ద హీరోయిన్ అయ్యాను. అందుకే నేను కూడా నిర్మాతగా కొత్తవారికి ఎంకరేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను.
నటిగా ఉన్నప్పుడు నిర్మాత కష్టాలేవీ నాకు అర్థం కాలేదు. ఒక్క రోజు ఒక్క సీన్ అనుకున్నట్టుగా జరగకపోతే ఎంత నష్టం వస్తుంది.. డబ్బు ఎంత వృథా అవుతుందో నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది. ఎంతో మంది టైం వేస్ట్ అవుతుందని అర్థమైంది. ‘శుభం’ చిత్రంలోని కేమియో పాత్రని నేను చేయాలని అనుకోలేదు. నిర్మాతగా మొదటిసారి ఎవరి దగ్గరికి వెళ్లి సాయం చేయాలని కోరాలని అనుకోలేదు. అందుకే ఆ పాత్రను నేనే పోషించాను. ఇప్పటివరకు నా చేతులతో మోసిన సినిమాని మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నా… ఆపై భారమంతా ప్రేక్షకులదే. సమ్మర్ హాలిడేస్‌లో కుటుంబమంగా కలిసి చూసేలా ‘శుభం’ చిత్రానికి మంచి డేట్ దొరికింది. అది మా అదృష్టం.
ప్రస్తుతం నేను ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని చేస్తున్నాను. జూన్ నుంచి మళ్లీ షూట్‌కు వెళ్తున్నాం. షూట్ స్టార్ట్ అయ్యాక వరుస అప్డేట్లు వస్తుంటాయి. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది. భవిష్యత్తులో మేం ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ చేస్తామేమో చూడాలి. నేను ఎప్పుడైనా కూడా నా మనసుకు నచ్చిందే చేశాను. ఈ సినిమాను నా మనసుకు నచ్చింది కాబట్టి చేశాను. నాకోసం ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయా. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. అతని ప్రేమను చూపించే తీరు మంచిదే అనిపించినా.. ఇలా గుళ్లు కట్టి పూజలు చేసే పద్దతి మాత్రం ఎంకరేజ్ చేయను’ అని చెప్పుకొచ్చింది సమంత.
Students : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం మరొక ముఖ్యమైన అడుగు వేసింది. ఇప్పటికే విద్యార్థుల విద్య, ఆరోగ్యం,…
YSR : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. ఒకవైపు యుద్ధాలు మరోవైపు పెరిగిపోతున్న ధరల వల్ల సామాన్యుడు గ్యాస్…
Summer Drinks : ఎండలు రోజురోజుకూ తీవ్రంగా మారుతున్న ఈ కాలంలో ప్రజలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ చూపుతున్నారు.…
Ajwain Water : మన వంటింట్లో ఉండే సాధారణ పోపు దినుసుల్లో వాముకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పూర్వం నుంచి…
Curry Leaves : మన వంటగదిలో కరివేపాకు లేకుండా వంట పూర్తి కావడం కష్టం. ప్రతి కూరలోనూ, పప్పులోనూ ఇది…
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్…
This website uses cookies.