
Niharika konidela : నేను సింగిల్ కాదు రిలేషన్ లో ఉన్న... నిహారిక కొణిదల...!
Niharika konidela : గత కొంత కాలంగా మెగా డాటర్ నిహారిక పేరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది. మరికొందరు ఆమె పేరును పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా జొన్నలగడ్డ చైతన్య తో నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత నుండి సోషల్ మీడియా నిహారికను ఒక రేంజ్ లో ఏకేసింది. అయితే ఇప్పుడిప్పుడే అవి తగ్గు మొహం పడుతున్నాయి అనుకుంటున్నా సమయంలో మరలా ఒక యూట్యూబ్ ఛానల్ కి తాజాగా నిహారిక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇక ఆ ఇంటర్వ్యూలో భాగంగా తన విడాకులపై నిహారిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర ,చర్చనియాంశంగా మారాయి. దీంతో ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
ఇంటర్వ్యూలో భాగంగా నిహారిక మాట్లాడుతూ…పెళ్లి అయిన తర్వాత జీవితం అనుకున్నంత సింపుల్ గా ఉండదని…మనుషులు మారిపోతారని…ఈ క్రమంలోనే మనుషులను నమ్మడం తప్పని తెలుసుకున్నట్లుగా నిహారిక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అయితే నిహారిక వ్యాఖ్యలు పరోక్షంగా జోలగడ్డ చైతన్య పై నెగిటివ్ ఇంపాక్ట్ పడేలా చేసింది. దీంతో తాజాగా ఈ వ్యాఖ్యలపై జొన్నలగడ్డ చైతన్య కూడా రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే విడాకుల విషయంలో నిజా నిజాలు తెలుసుకొని మాట్లాడాలని , ఎప్పుడూ కూడా ఒకేవైపు జడ్జిమెంట్ తీసుకోకూడదు అంటూ కాసింత ఘాటుగానే చైతన్య రెస్పాండ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. ఇది ఇలా ఉంటే ఇంటర్వ్యూలో నిహారిక మాట్లాడుతూ..నేను విడాకులు తీసుకున్న తర్వాత సింగిల్ గా లేను అంటూ చెప్పుకోచ్చారు.
నేను మా అమ్మానాన్నలతో , అన్నా వదినలతో హ్యాపీగా కలిసి ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. వారందరూ నాకు ఎంతో సపోర్ట్ గా ఉన్నారని…అందుకే నేను సింగిల్ గా ఉన్నానని ఎప్పుడూ అనుకోలేదు అంటూ చెప్పుకొచ్చింది. అలాగే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతున్నానని..మరోవైపు సినిమాలు కూడా నిర్మిస్తున్నట్లు ఆమె తెలియజేసింది. దీంతో ప్రస్తుతం నా లైఫ్ చాలా బిజీగా ఉందంటూ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యూచర్ లో నిహారిక రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయ వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
This website uses cookies.