Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జ‌గ‌న్ చేయాల్సిన ప‌నులేంటి, ఏ రూల్స్ మారాలి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జ‌గ‌న్ చేయాల్సిన ప‌నులేంటి, ఏ రూల్స్ మారాలి..!

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •   Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జ‌గ‌న్ చేయాల్సిన ప‌నులేంటి, ఏ రూల్స్ మారాలి..!

Ys Jagan : ఏపీలో ఈ సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన వారు మెల్ల‌గా జారుకుంటున్నారు. వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ధైర్యం చెబుతున్నారు. ఎన్నికల్లో ఓటమిపై డీలా పడొద్దంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తమ ఎంపీలకు తాజాగా ధైర్యం చెబుతున్న‌రు. తనదింకా చిన్న వయసేనని, మళ్లీ అధికారం చేపడతానని ధీమా వ్యక్తం చేశారు. ‘వైసీపీ పార్టీని నమ్ముకుని కోట్లాది కుటుంబాలు ఉన్నాయి. లక్షాలాది మంది కార్యకర్తలు, వేలాది మంది నాయకులు ఉన్నార‌ని చెప్పారు.

 Ys Jagan జ‌గ‌న్ కొత్త వ్యూహం..

ప్ర‌స్తుతం జ‌గ‌న్ పార్టీ డెవ‌ల‌ప్ మెంటుపై ప్ర‌త్యేక‌ దృష్టి పెట్టారు. తాజాగా నిర్వ‌హించిన పార్టీ నేత‌ల స‌మీక్షా స‌మావేశంలో పార్టీని ఏవిధంగా అభివృద్ధి చేయాలి, ఏ పార్టీ లేని విధంగా త‌మ పార్టీ ఎలా ఉండాలి అనే దానిపై సూచ‌న‌లు చేశారు. పార్టీ డెవ‌ల‌ప్ మెంటు అంటే.. కేవ‌లం నాలుగు మీటింగులు పెట్టి.. నాలుగు ప‌ద‌వులు పంచ‌డం కాద‌ని జ‌గ‌న్‌కి అర్ధ‌మైంది. ఈ స‌మ‌యంలో త‌నకి తానుగా మార్చుకోవాల‌ని అనుకుంటున్నాడు. క్షేత్ర‌స్థాయి కేడ‌ర్‌కి మ‌రింత చేరువ అవుతూ నాయ‌కుల‌కి అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నాడు. అలా చేయ‌క‌పోతే పార్టీ అభివృద్ది బాట ప‌ట్టే ప‌రిస్థితి ఉండ‌దు.

Ys Jagan ఫామ్‌లోకి రావాలంటే జ‌గ‌న్ చేయాల్సిన ప‌నులేంటి ఏ రూల్స్ మారాలి

Ys Jagan : ఫామ్‌లోకి రావాలంటే జ‌గ‌న్ చేయాల్సిన ప‌నులేంటి, ఏ రూల్స్ మారాలి..!

నిజానికి ఇప్పుడు మీటింగుకు వ‌చ్చిన వారిలో చాలా మంది మ‌న‌సు ఒక చోట ఉంటే.. మ‌నుషులు మ‌రో చోట ఉండ‌డం గ‌మ‌నార్హం. కాబ‌ట్టి .. అస‌లు మార్పు ప్యాలెస్‌లోనే జ‌ర‌గాల‌న్న‌ది వాస్త‌వం. ప్రభుత్వం వచ్చిన నాలుగు నెలల్లోనే పాలన కుప్పకూలింది. సూపర్‌ సిక్సులూ లేవు. సూపర్‌ సెవెన్లూ లేవు. మరోపక్క అబద్ధాలు చెబుతున్నారు. స్కూళ్లు పోయాయి.. చదువులూ పోయాయి.. ఆస్పత్రులూ పోయాయి. ఆరోగ్యశ్రీలూ పోయాయి. ఆసరా పోయింది.. డోర్‌ డెలివరీ పోయింది. వ్యవసాయం పోయింది. పెట్టుబడి సాయం పోయింది. ఉచిత బీమా పోయింది.. ఆర్బీకేలూ పోయాయి.. ఇలా అన్నీ పోయాయి. వ్యవసాయం, చదువులు, వైద్యం మూడు రంగాలూ తిరోగమనంలోకి వెళ్లిపోయాయి’ అని జ‌గ‌న్ ఆరోపించారు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది