Bigg Boss 8 Telugu : య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 Telugu : య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షో ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. అస‌లైన ఆట మొద‌లు కావ‌డంతో రంజుగా మారింది. తాజా ఎపిసోడ్‌లో నబీల్ కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు.. స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మీ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసి విష్ణు ప్రియా […]

 Authored By ramu | The Telugu News | Updated on :3 October 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 Telugu : య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ షో ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. అస‌లైన ఆట మొద‌లు కావ‌డంతో రంజుగా మారింది. తాజా ఎపిసోడ్‌లో నబీల్ కు ఫన్నీ టాస్క్ ఇచ్చాడు.. స్పూన్‌తో బకెట్ నీళ్లు నింపాలని టాస్క్ ఇచ్చారు. ఆ తర్వాత మణికంఠ యష్మీ కలిసి డాన్స్ చేస్తే చూడాలని ఉందని అన్నారు బిగ్ బాస్. దాంతో ఇద్దరూ కలిసి డాన్స్ చేశారు. పృథ్వీకి లేడీ గెటప్ వేశారు. పృథ్వీ గెటప్ చూసి విష్ణు ప్రియా అయితే తెగ సిగ్గుపడింది. ఇక ఈ గేమ్‌లో కాంతార టీం గెలవడంతో.. వాళ్లకి చాక్లెట్స్ పంపించాడు బిగ్ బాస్. దాంతో సర్వైవల్ టాస్క్ పూర్తి అవ్వడంతో అన్ని గేమ్స్ లో ఎక్కువ ఎవరు గెలిచారో వాళ్లకు స్పెషల్ పవర్ ఇచ్చాడు బిగ్. కాంతార టీమ్ కు పవర్ లభించింది.ఆ తర్వాత క్లాన్ నుంచి నేరుగా చీఫ్ అవకాశాన్ని ఇచ్చారు బిగ్ బాస్.

Bigg Boss 8 Telugu రంజుగా మారుతున్న షో..

దాంతో ఎవరు ఛీప్ గా ఉండాలని డిస్కషన్ పెట్టారు. యష్మీ నేనే చీఫ్ అన్నట్టుగా చెప్పుకొచ్చింది. కానీ పృథ్వీకి అంత నాలెడ్జ్ లేదు అని మాట్లాడింది. దానికి పృథ్వీ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. నువ్వు చీఫ్ అయితే హౌస్ ఇప్పుడు ఉన్నట్టుగా ఉండదు అని అనేశాడు. దాంతో యష్మీ అరవడం మొదలు పెట్టింది. దాంతో నువ్వు వాయస్ పెంచకు.. ఆల్రెడీ నువ్వు చీఫ్ అయ్యావ్.. పైగా నువ్వు చీఫ్‌గా ఫెయిల్ అయ్యావని నీకు నువ్వే ఒప్పుకున్నావ్.. మళ్లీ చీఫ్ అవుతానని ఎలా అంటున్నావ్..అంటూ పృథ్వీ కూడా గట్టిగానే ఇచ్చిపడేశాడు.దాంతో పృథ్వీ యష్మీ బాగోతాలను బయట పెట్టడం మొదలు పెట్టాడు. నువ్వు మణికంఠని మగాడు కాదని అన్నావ్ కదా.. అనలేదని అబద్దం చెప్పావ్ అని పృథ్వీ అడిగితే నేను అలా అనలేదు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది.

Bigg Boss 8 Telugu య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి ట్విస్ట్‌లు మాములుగా లేవు

Bigg Boss 8 Telugu : య‌ష్మీ బాగోతాలన్నీ పృథ్వీ ఇలా బ‌య‌ట‌పెట్టేసాడేంటి.. ట్విస్ట్‌లు మాములుగా లేవు..!

అవునా.. నువ్వు అననప్పుడు ఎందుకు సారీ చెప్పావ్ అని అన్నాడు పృథ్వీ. దాంతో ఆ పాయింట్ తీయకు అంటూ చెప్పుకొచ్చింది యష్మీ . ఆ టాపిక్ ఎత్తకు.. మమ్మీపై ఒట్టేశాను కదా’ అని చెప్పుకొచ్చింది యష్మీ. మణికంఠని బాయ్ కాదని అనడం నువ్వు చేసిన తప్పు. దాన్ని మళ్లీ ఒప్పుకోకపోవడం ఇంకో తప్పు. నీకు నువ్వే చీఫ్‌గా ఫెయిల్ అయ్యానని రెడ్ ఇచ్చుకున్నావ్.. నీకు నువ్వే తెలుసు.. బ్యాడ్ ప్లేయర్ అని.. స్పెల్లింగ్ గేమ్‌లో ఓడిపోయావ్.. ఇవన్నీ నీ మిస్టేక్సే అని యష్మీ బాగోతాలు బయట పెట్టాడు పృథ్వీ .మిడ్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా ముందుగా ఆదిత్య ఓంని గురువారం ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేశారట. శనివారం రోజు నైనికా ఎలిమినేషన్ జరుగుతుంది. అయితే ఆదిత్య హౌస్ నుంచి బయటకి వెళతాడు కానీ పబ్లిక్ లోకి రాడు అని అంటున్నారు. శనివారం ఎపిసోడ్ వరకు నిర్వాహకులు అతడిని సీక్రెట్ గా ఉంచి.. శనివారం ఎపిసోడ్ లో వేదికపైకి పంపించబోతున్నారు అని సమాచారం

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది