Chammak Chandra : చమ్మక్ చంద్ర అనేవాడు లేకపోతే ఇన్నాళ్లు జబర్దస్త్ కొనసాగేది కాదు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chammak Chandra : చమ్మక్ చంద్ర అనేవాడు లేకపోతే ఇన్నాళ్లు జబర్దస్త్ కొనసాగేది కాదు..!!

Chammak Chandra : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ కార్యక్రమాన్ని మొదట ఎనిమిది వారాలు మాత్రమే ప్రసారం చేయాలని భావించారు. కమెడియన్స్ తో అంతే మొత్తానికి ఒప్పందం చేసుకున్నారు, కానీ చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ కి మంచి రేటింగ్ రావడం మొదలైంది. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్న కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. జబర్దస్త్ ఈ స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుని పాపులారిటీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :22 January 2023,2:20 pm

Chammak Chandra : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ కార్యక్రమాన్ని మొదట ఎనిమిది వారాలు మాత్రమే ప్రసారం చేయాలని భావించారు. కమెడియన్స్ తో అంతే మొత్తానికి ఒప్పందం చేసుకున్నారు, కానీ చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ కి మంచి రేటింగ్ రావడం మొదలైంది. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్న కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. జబర్దస్త్ ఈ స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుని పాపులారిటీ

దక్కించుకోవడానికి కారణం చాలా మంది ఉన్నారు. అయితే అందులో ప్రధానంగా మొదటి వాడు చమ్మక్ చంద్ర అనడంలో సందేహం లేదు. ఆయన ఎప్పుడైతే లేడీ గెటప్ వేసి చీర పైకెత్తి మాస్ అవతారంలో కనిపించాడో అప్పటి నుంచి జబర్దస్త్ గురించి జనాల్లో చర్చ మొదలైంది. ఇలాంటి కామెడీ షో భలే ఉందే అన్నట్లుగా జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈటీవీ యొక్క రేటింగ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా అద్భుతమైన కామెడీ స్కిట్స్ ఇతర కమెడియన్స్ కూడా చేయడం వల్ల పది సంవత్సరాలైనా జబర్దస్త్ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

if there is no Chammak Chandra in jabardasth what happened

if there is no Chammak Chandra in jabardasth what happened

ఒకానొక సమయంలో చమ్మక్ చంద్ర అలాంటి కామెడీ స్కిట్ చేసి ఉండక పోతే కచ్చితంగా జబర్దస్త్ ఇంత కాలం కొనసాగేది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కి వచ్చిన అనూహ్య స్పందన కి కారణం చమ్మక్ చంద్ర, ఆ స్పందన కంటిన్యూ అవ్వడానికి చాలా మంది కమెడియన్స్ భాగస్వామ్యం వహించారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర సినిమాలతో బిజీగా ఉన్నాడు. మళ్లీ ఆయన జబర్దస్త్ లోకి తీసుకు రావాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆయన ఆసక్తిగా లేడు అలాగే మల్లెమాల వారు ఆయనకు అంత పారితోషికం ఇవ్వలేరు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది