Chammak Chandra : ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. ఈ కార్యక్రమాన్ని మొదట ఎనిమిది వారాలు మాత్రమే ప్రసారం చేయాలని భావించారు. కమెడియన్స్ తో అంతే మొత్తానికి ఒప్పందం చేసుకున్నారు, కానీ చాలా తక్కువ సమయంలోనే జబర్దస్త్ కి మంచి రేటింగ్ రావడం మొదలైంది. ఒకానొక సమయంలో దేశంలోనే అత్యధిక రేటింగ్స్ సొంతం చేసుకున్న కామెడీ షో గా జబర్దస్త్ నిలిచింది. జబర్దస్త్ ఈ స్థాయిలో రేటింగ్ సొంతం చేసుకుని పాపులారిటీ
దక్కించుకోవడానికి కారణం చాలా మంది ఉన్నారు. అయితే అందులో ప్రధానంగా మొదటి వాడు చమ్మక్ చంద్ర అనడంలో సందేహం లేదు. ఆయన ఎప్పుడైతే లేడీ గెటప్ వేసి చీర పైకెత్తి మాస్ అవతారంలో కనిపించాడో అప్పటి నుంచి జబర్దస్త్ గురించి జనాల్లో చర్చ మొదలైంది. ఇలాంటి కామెడీ షో భలే ఉందే అన్నట్లుగా జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఈటీవీ యొక్క రేటింగ్ అమాంతం పెరిగింది. అంతే కాకుండా అద్భుతమైన కామెడీ స్కిట్స్ ఇతర కమెడియన్స్ కూడా చేయడం వల్ల పది సంవత్సరాలైనా జబర్దస్త్ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.
ఒకానొక సమయంలో చమ్మక్ చంద్ర అలాంటి కామెడీ స్కిట్ చేసి ఉండక పోతే కచ్చితంగా జబర్దస్త్ ఇంత కాలం కొనసాగేది కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్ కి వచ్చిన అనూహ్య స్పందన కి కారణం చమ్మక్ చంద్ర, ఆ స్పందన కంటిన్యూ అవ్వడానికి చాలా మంది కమెడియన్స్ భాగస్వామ్యం వహించారు. ఇప్పుడు చమ్మక్ చంద్ర సినిమాలతో బిజీగా ఉన్నాడు. మళ్లీ ఆయన జబర్దస్త్ లోకి తీసుకు రావాలని చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ ఆయన ఆసక్తిగా లేడు అలాగే మల్లెమాల వారు ఆయనకు అంత పారితోషికం ఇవ్వలేరు.
Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మనకు ఠక్కున గుర్తిచ్చే పేరు ప్రభాస్. మనోడు పెళ్లి విషయాన్ని…
Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…
NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…
Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…
Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…
Telangana : తెలంగాణలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే…
Seaplane Trial Run : విమానాశ్రయ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, విమానయాన సంబంధిత పరిశ్రమలను ప్రోత్సహించడం మరియు ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను…
This website uses cookies.