
Ileana : తన భర్త గురించి ఇన్నాళ్లు చెప్పకపోవడంపై క్లారిటీ ఇచ్చిన ఇలియానా..!
Ileana : అందాల ముద్దుగుమ్మ ఇలియానా ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. 2006లో దేవదాసు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత పోకిరీ, రాఖీ, జల్సా, కిక్, జులాయి సహా చాలా తెలుగు సినిమాల్లో కథానాయికగా నటించి మెప్పించింది. ఇక ఆ తర్వాత 2013లో బాలీవుడ్‍పై ఆమె ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే అక్కడ కూడా పెద్దగా విజయాలు అందుకోలేకపోయింది. ఈ క్రమంలో మళ్లీ టాలీవుడ్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం చేశారు ఇలియనా. ఇది సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్లి అక్కడే సినిమాలు చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ హిందీలో చివరగా 2021లో ది బిగ్ బుల్ చిత్రంలో నటించింది. ఇప్పుడు ఆమె నటించిన దో ఔర్ దో ప్యార్ మూవీ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
ఇలియానా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఈ ముద్దుగుమ్మ కెరీర్ పీక్స్‌లో ఉండగా ఓ వ్యక్తిని ప్రేమించింది. కొన్నాళ్లపాటు ఇద్దరు అన్యోన్యంగా ఉండగా, తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. అనంతరం డిప్రెషన్‌లోకి వెళ్లిన ఇలియానా బాగా లావు పెరిగిపోయింది. అదే సమయంలో అవకాశాలు కూడా తగ్గాయి. కట్ చేస్తే ఈ గోవా బ్యూటీ కొద్ది రోజుల క్రితం బేబి బంప్ పిక్స్ షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లి ఎలా అయిందంటూ అందరు ఆశ్చర్యపోయారు.ఇలియానా తొలుత తన జీవిత భాగస్వామి మైకేల్ డోలాన్‍ను నేరుగా ప్రపంచానికి పరిచయం చేయకుండా, ఫొటోలు షేర్ చేయకుండా దోబూచులాడింది.
గర్భిణి అయ్యాక కూడా చాలా రోజుల పాటు అతనిని ఇంట్రడ్యూస్ చేయలేదు. గతేడాది ఆగస్టు 1వ తేదీన మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా ఆ తర్వాత మెల్లగా తన భర్త ఫేస్ రివీల్ చేసింది. అయితే ఇలియానా తాజాగా మాట్లాడుతూ.. తాను గర్భంతో ఉన్న సమయంలో కూడా పని చేయాలని ఎంతగానో అనుకున్నట్టు పేర్కొంది. అయితే పలు ఇబ్బందులు ఏర్పడడంతో చేయలేకపోయినట్టు పేర్కొంది. 2023 తనకు ఎంతో సంతోషకరమైన సంవత్సరమని చెప్పిన ఇలియానా, గర్భవతిగా ఉన్నప్పుడు తన తల్లి చాలా మద్దతుగా నిలిచారని పేర్కొంది. తన భర్త మైకేల్ డోలాన్ అద్భుతమైన వ్యక్తి అని చెబుతూ మా బంధం గురించి మాటల్లో చెప్పలేమని తెలియజేసింది. నా గురించి ఎవరు ఎమన్నా నేను తట్టుకోగలను కానీ నా భర్త గురించి, నా కుటుంబం గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అస్సలు తట్టుకోలేనంటూ పేర్కొంది.
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
This website uses cookies.