Pawan Kalyan : నయనతార ప్లేస్ లో పవన్ కళ్యాణ్… భవిష్యత్తు ఊహిస్తున్న చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Pawan Kalyan : నయనతార ప్లేస్ లో పవన్ కళ్యాణ్… భవిష్యత్తు ఊహిస్తున్న చిరంజీవి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి దాదాపుగా 10 సంవత్సరాలు కాబోతుంది.. అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయంగా ఆయన చక్రం తిప్పింది లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటుతాడు అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా మద్దతు లభించబోతుంది అంటూ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :7 October 2022,4:30 pm

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు చేసి దాదాపుగా 10 సంవత్సరాలు కాబోతుంది.. అయినా ఇప్పటి వరకు రాష్ట్రంలో రాజకీయంగా ఆయన చక్రం తిప్పింది లేదు. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా సత్తా చాటుతాడు అంటూ ఆయన ఫాలోవర్స్ మరియు అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సమయంలోనే ఆయనకు మెగాస్టార్ చిరంజీవి నుండి కూడా మద్దతు లభించబోతుంది అంటూ ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా భవిష్యత్తులో తనకు నా మద్దతు ఉండవచ్చు అన్నట్లుగా చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. వేరే పార్టీల కంటే తన తమ్ముడి పార్టీకే తన మద్దతు ఎక్కువ అన్నట్లుగా చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఆ సమయంలో వైరల్ అయ్యాయి.

తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసింది. ఆ సినిమాలో సోదరి అయిన నయనతారను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు చిరంజీవి కింగ్ మేకర్ పాత్రను పోషించిన విషయం తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లుగానే అనిపించిన ఆయన యొక్క తెలివి తేటలు మరియు చాతుర్యంతో, క్రేజ్ తో నయనతారను సీఎంగా సినిమాలో చేయడం జరిగింది. భవిష్యత్తులో గాడ్ ఫాదర్ సినిమా రియల్ లైఫ్ లో రిపీట్ అవ్వబోతుందని మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్ లో బ్రహ్మ పాత్రను చిరంజీవి పోషించనుండగా నయనతార ప్లేసులో పవన్ కళ్యాణ్ ఉంటాడని కింగ్ మేకర్ గా పవన్ కళ్యాణ్ ను చిరంజీవి సీఎంగా కూర్చోబెడతాడని అభిమానుల్లో చర్చ జరుగుతుంది.

in ap politics god father movie happen soon

in ap politics god father movie happen soon

ఇదే విషయం రాజకీయ విశ్లేషకులు కూడా చర్చ జరుగుతుంది. మెగాస్టార్ చిరంజీవి కింగ్ కాలేక పోయినా కింగ్ మేకర్ అయ్యేంత సత్తా అతనికి ఉంది, కనుక మెగాస్టార్ చిరంజీవి బాహాటంగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపితే వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ మెజార్టీ స్థానాల్లో గెలుపొంది పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా ఏపీ రాజకీయాల్లో రిపీట్ అయితే పవన్ కళ్యాణ్ కి కలిసివస్తుందని నేడు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి అయినా చిరంజీవి గాడ్ ఫాదర్ పాత్రను పోషిస్తాడని కచ్చితంగా తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం బరిలో నిలుస్తాడని అంతా నమ్ముతున్నారు. ఏం జరగబోతుందో 2024 ఎన్నికల వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది