
NTR : సినిమాలన్నాక కొన్ని సార్లు యాక్షన్ సీన్స్ చేసినప్పుడు, ఛేజింగ్ సీన్స్ చేసినప్పుడు, బైక్ స్టంట్స్ చేసినప్పుడు ఆఖరికి డాన్స్ మూవ్ మెంట్స్ చేసినప్పుడు కూడా చాలాసార్లు మన హీరోలు గాయాలపాలవుతుంటారు. కొన్ని సార్లు ఈ గాయాలు తీవ్రంగా తగలడంతో ప్రాణాల మీదకి వచ్చిన సందర్భాలు..హీరోలు కూడా మన టాలీవుడ్ లో ఉన్నారు. హీరోలకే కాదు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేసేటప్పుడు ఫైట్ మాస్టర్స్ కి భారీగా దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు విరిగిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా ఇలా ఎక్కువ సార్లు యాక్షన్ సీన్స్ కంపోజ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. ఇక ఎక్కువ సినిమాలలో గాయపడింది అంటే జూనియర్ ఎన్.టి.ఆర్.
in these 10 movies ntr-are got hurted so much
ఇంతకీ ఎన్.టి.ఆర్ అంతగా గాయపడిన ఆ 10 సినిమాలేంటో ఓసారి చూద్దాం. స్టూడెంట్ నెంబర్ 1 : ఈ సినిమాకి దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఇది ఆయన కి దర్శకుడిగా మొదటి సినిమా. ఇక జూనియర్ ఎన్.టి.ఆర్ కి 2వ సినిమా. అయినా కెరీర్ లో బిగ్ హిట్ భారీ హిట్. ఇందులో ఉన్న ఒక సన్నివేశంలో గాయాలైన తారక్ కొన్నాళ్ళు షూటింగ్ కి హాజరవలేకపోయాడు. 2వ సినిమా ఆది : వి వి వినాయక్ డెబ్యూ సినిమా ఇది. గాలో సుమోలు లేవడం అనే ట్రెండ్ దీనితోనే మొదలైంది. ఒక భారీ ఫైట్ సీన్
చేస్తున్నప్పుడు తారక్ మోచేతికి గాయం అయింది. అలాగే కట్టుకొని ఒక సాంగ్ లో చేశాడు.
3వ సినిమా సింహాద్రి : ఎన్.టి.ఆర్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు వచ్చి ఇండస్ట్రీ హిట్ సాధించిన సినిమా. దీనికి రాజమౌళి దర్శకత్వం వహించాడు. క్లైమాక్స్ షూటింగ్ జరుగుతున్నప్పుడు తారక్ కి గాయం అయింది. అయినా షూటింగ్ కంటిన్యూ చేశాడు. ఇక 4వ సినిమా సాంబ : ఇది వి.వి.వినాయక్ తారక్ కాంబినేషన్ లో వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. దాదాపు 40 మంది ఫైటర్లతో యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు తారక్ కి దెబ్బతగిలింది. 5వ సినిమా యమదొంగ : దర్శక ధీరుడు – తారక్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రోప్
కట్టుకున్న సమయంలో అలాగే ఒక సాంగ్ లో తారక్ కి గాయాలయ్యాయి.
6వ సినిమా అదుర్స్ : ఇందులో తారక్ డ్యూయల్ రోల్ లో నటించాడు. వి వి వినాయక్ దర్శకత్వం వహిచాడు. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు గాయాలు అవలేదు. పార్టీ ప్రచారం కోసం వెళుతున్నప్పుడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. వెన్నుముక బాగా దెబ్బతింది. డాక్టర్లు ఇక డాన్స్ చేయడం కష్టం అని చెప్పారు. అయినా అదుర్స్ లో ఎన్.టి.ఆర్ డాన్స్ ఇరగదీశాడు.7వ సినిమా బృందావనం : వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాడు. సినిమాలోని క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణ సమయంలో తారక్ గాయపడ్డాడు. సమంత – కాజల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
8వ సినిమా ఊసరవెల్లి : స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో తమన్న హీరోయిన్. ఒక ఎమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు తారక్ గాయపడ్డాడు. ఈ సినిమా సక్సెస్ కాలేదు. 9వ సినిమా శక్తి : మెహెర్ రమేష్ దర్శకత్వంలో ఏ సినిమా వచ్చింది. ఇలియానా హీరోయిన్ గా నటించింది. అశ్వనీదత్ నిర్మాత. షూటింగ్ అయ్యాక కూడా కొన్ని సీన్స్ అదనంగా తీశారు. అప్పుడు తారక్ తీవ్రంగా గాయపడ్డాడు. 10 వ సినిమా ఆర్.ఆర్.ఆర్ : భారీ బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా. రాం చరణ్ హీరోగా నటిస్తున్న ఇందులోని భారీ యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు తారక్ కి గాయాలయ్యాయి. ఇక్కడ కామన్ గా చూస్తే రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ నటించిన ప్రతీ సినిమాలో గాయాలయ్యాయి.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.