Indraja : టాలీవుడ్ ఒకప్పటి అందాల హీరోయిన్ ఇంద్రజ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. చూడచక్కని అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తోంది. ఇందులో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారితో ఇంద్రజ చేసే సందడి మాములుగా ఉండదు. రష్మి, ఇంద్రజ కూడా తమదైన శైలిలో వినోదం పంచుతూ ఉంటారు. అయితే ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే ఇంద్రజ తాజాగా వెక్కివెక్కి ఏడ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
మే 12న మదర్స్ డే కావడం వలన శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. మొదట్లో చాలా సరదాగా సాగిన ఈ ప్రోమో రాను రాను ఎమోషనల్‌గా మారింది. షోకి ఫైమా, అంజలి లాంటి వారంతా వారి తల్లులతో కలిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్ కి హాజరయ్యాడు. రష్మీ ఈ షోలో మమ్మి వర్సెస్ డాటర్స్ అనే గేమ్ నిర్వహించింది. ఈ గేమ్ సరదాగా సాగింది. మదర్స్ డే సందర్భంగా బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, నూకరాజు, పొట్టి నరేష్ వంటి వారు ఇంద్రజని తల్లిగా భావించి ఆమెకి సన్మానం చేశారు.
ఈ క్రమంలో ఒక్కొక్కరు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు. ఇక నూకరాజు అయితే అందమైన చీరని బహుకరించడంతో ఇంద్రజ చాలా ఎమోషనల్ అయింది. ఇక తన తల్లిని గుర్తు చేసుకుంటూ తెగ ఏడ్చేసింది. మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి తండ్రి లేకుంటే అనాధలమే. మన తల్లిదండ్రులకి సేవ చేయకుండా ఊర్లో ఎంత మందికి చేసిన ప్రయోజనం ఉండదు. తన తల్లి చివరి కోరిక నెరవేర్చలేకపోయానని ఇంద్రజ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. రష్మీ గౌతమ్ వచ్చి ఓదార్చుతున్నప్పటికీ ఇంద్రజ గుండె బద్దలయ్యేలా ఏడ్చారు. ఆమె బాధ చూసి అక్కడున్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లమని చాలా సార్లు అడగ్గా, నేను తీసుకెళ్లలేకపోయాను. మా అమ్మ కనిపిస్తే ఆ కోరిక తీర్చాలని ఉందంటూ ఇంద్రజ పేర్కొంది
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
This website uses cookies.