Indraja : వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదారుస్తున్నా ఆపుకోలేకపోయింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Indraja : వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదారుస్తున్నా ఆపుకోలేకపోయింది..!

Indraja : టాలీవుడ్ ఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్ ఇంద్ర‌జ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చక్క‌ని అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తోంది. ఇందులో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారితో ఇంద్ర‌జ చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. ర‌ష్మి, ఇంద్ర‌జ కూడా త‌మ‌దైన శైలిలో వినోదం పంచుతూ ఉంటారు. […]

 Authored By ramu | The Telugu News | Updated on :6 May 2024,11:00 am

ప్రధానాంశాలు:

  •  Indraja : వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదారుస్తున్నా ఆపుకోలేకపోయింది..!

Indraja : టాలీవుడ్ ఒక‌ప్ప‌టి అందాల హీరోయిన్ ఇంద్ర‌జ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ‌చక్క‌ని అందాలు కల్గిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. అలాగే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో కూడా జడ్జిగా చేస్తోంది. ఇందులో హైపర్ ఆది, బుల్లెట్ భాస్కట్, ఆటో రాంప్రసాద్ లాంటి వారితో ఇంద్ర‌జ చేసే సంద‌డి మాములుగా ఉండ‌దు. ర‌ష్మి, ఇంద్ర‌జ కూడా త‌మ‌దైన శైలిలో వినోదం పంచుతూ ఉంటారు. అయితే ఎప్పుడు న‌వ్వుతూ న‌వ్విస్తూ ఉండే ఇంద్రజ తాజాగా వెక్కివెక్కి ఏడ్చింది. అందుకు సంబంధించిన ప్రోమో వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Indraja : భ‌రించ‌లేని భావోద్వేగం..

మే 12న మ‌ద‌ర్స్ డే కావ‌డం వ‌ల‌న శ్రీదేవి డ్రామా కంపెనీలో స్పెష‌ల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రోమో కూడా విడుద‌ల చేశారు. మొద‌ట్లో చాలా స‌ర‌దాగా సాగిన ఈ ప్రోమో రాను రాను ఎమోష‌న‌ల్‌గా మారింది. షోకి ఫైమా, అంజలి లాంటి వారంతా వారి తల్లులతో క‌లిసి శ్రీదేవి డ్రామా కంపెనీ షోకి హాజరయ్యారు. ఇక గెటప్ శ్రీను తాను నటిస్తున్న రాజు యాదవ్ చిత్ర ప్రమోషన్స్ కి హాజరయ్యాడు. రష్మీ ఈ షోలో మమ్మి వర్సెస్ డాటర్స్ అనే గేమ్ నిర్వహించింది. ఈ గేమ్ సరదాగా సాగింది. మదర్స్ డే సందర్భంగా బులెట్ భాస్కర్, ఇమ్మాన్యూల్, నూకరాజు, పొట్టి నరేష్ వంటి వారు ఇంద్ర‌జ‌ని త‌ల్లిగా భావించి ఆమెకి స‌న్మానం చేశారు.

Indraja వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌ ర‌ష్మీ ఓదారుస్తున్నా ఆపుకోలేకపోయింది

Indraja : వెక్కి వెక్కి ఏడ్చిన ఇంద్ర‌జ‌.. ర‌ష్మీ ఓదారుస్తున్నా ఆపుకోలేకపోయింది..!

ఈ క్ర‌మంలో ఒక్కొక్క‌రు ఒక్కో గిఫ్ట్ ఇచ్చారు. ఇక నూక‌రాజు అయితే అంద‌మైన చీర‌ని బ‌హుక‌రించ‌డంతో ఇంద్ర‌జ చాలా ఎమోష‌న‌ల్ అయింది. ఇక త‌న త‌ల్లిని గుర్తు చేసుకుంటూ తెగ ఏడ్చేసింది. మన జీవితంలో ఎన్ని రిలేషన్స్ ఉన్నా సరే తల్లి తండ్రి లేకుంటే అనాధ‌ల‌మే. మ‌న త‌ల్లిదండ్రులకి సేవ చేయ‌కుండా ఊర్లో ఎంత మందికి చేసిన ప్ర‌యోజ‌నం ఉండ‌దు. తన తల్లి చివరి కోరిక నెరవేర్చలేకపోయానని ఇంద్రజ ఒక్కసారిగా వెక్కి వెక్కి ఏడ్చింది. రష్మీ గౌతమ్ వచ్చి ఓదార్చుతున్నప్పటికీ ఇంద్రజ గుండె బద్దలయ్యేలా ఏడ్చారు. ఆమె బాధ చూసి అక్కడున్నవారంతా కంటతడి పెట్టుకున్నారు. మా అమ్మ ఉన్నప్పుడు ఓ గుడికి తీసుకెళ్లమని చాలా సార్లు అడ‌గ్గా, నేను తీసుకెళ్లలేక‌పోయాను. మా అమ్మ క‌నిపిస్తే ఆ కోరిక తీర్చాల‌ని ఉందంటూ ఇంద్రజ పేర్కొంది

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది