Jabardasth : జబర్దస్త్ లో సినిమా ప్రమోషన్‌ కు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా..!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: June 26, 2022, 11:00 am

Jabardasth : తెలుగు సినిమా యొక్క ప్రమోషన్ కొత్త పంథాలో నడుస్తోంది. సినిమాను ఎంత గొప్పగా తీశారు.. ఎంత భారీ బడ్జెట్‌ ఖర్చు చేశారు అనే విషయాలను తర్వాత చూస్తున్నారు. సినిమా ను ఎంతగా ప్రమోట్‌ చేశారు అనేది ఇప్పుడు చాలా పెద్ద విషయంగా మారింది. దర్శక నిర్మాతలు సినిమాల ప్రమోషన్ కు కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ సినిమాను జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా బుల్లి తెరపై చాలా సినిమాలకు ప్రమోషన్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. జబర్దస్త్‌ షో ద్వారా ప్రతి వారం ఏదో ఒక సినిమా ప్రమోషన్‌ జరుగుతూనే ఉంది.

జబర్దస్త్‌ లోనే కాకుండా ఏ షో లో అయినా ఒక సినిమాను ప్రమోట్‌ చేసుకోవాలంటే ఆ షో నిర్వాహకులకు లేదా ఛానల్‌ వారికి సదరు నిర్మాత భారీ మొత్తంలో అమౌంట్ ను చెల్లించాల్సి ఉంటుంది. ఆ అమౌంట్‌ అనేది ఆ షో రేటింగ్ మరియు జనాల్లో ఆ సినిమాకు ఉన్న పాపులారిటీని బట్టి ఉంటుంది. షో కు టాప్ రేటింగ్‌ ఉంటే.. సినిమా నిర్మాతలు ఆ షో లో ప్రమోషన్ కు ఇచ్చే అమౌంట్ కూడా అంతే ఉంటుంది. ఉదాహరణకు తెలుగు బుల్లి తెర టాప్ షో లు అయిన జబర్దస్త్‌.. క్యాష్‌ ఇంకా కొన్ని షో ల్లో సినిమా ప్రమోట్ చేయాలంటే లక్షలకు లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

interesting news about movie promotions in etv Jabardasth comedy show

interesting news about movie promotions in etv Jabardasth comedy show

మల్లెమాల మరియు ఈటీవీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం జబర్దస్త్‌ షో లో ఒక సినిమా ను ప్రమోట్‌ చేసుకోవాలంటే 12 లక్షల నుండి 15 లక్షల వరకు సదరు నిర్మాత ఈటీవీ మరియు మల్లెమాల వారికి చెల్లించాల్సి ఉంటుందట. ఈ మొత్తం గతంలో పాతిక లక్షల వరకు ఉండేదట. ఈమద్య కాలంలో జబర్దస్త్‌ రేటింగ్‌ తగ్గడం వల్ల ఈ అమౌంట్ కూడా తగ్గిందని అంటున్నారు. క్యాష్ లో సినిమా ప్రమోషన్‌ కు కూడా దాదాపుగా పది లక్షల రూపాయలకు పైగానే నిర్మాతలు చెల్లించాల్సి ఉంటుందని సమాచారం అందుతోంది. మొత్తానికి బ్రాండ్స్ ప్రమోషన్‌ ద్వారా మాత్రమే కాకుండా సినిమాల ప్రమోషన్ ద్వారా కూడా జబర్దస్ద్‌ వారు భారీగా సంపాదిస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp