Home » Entertainment » Interesting News In Tollywood Movies
Entertainment

Tollywood movies : తెలుగు సినిమాలలో లిప్ లాక్స్ అందుకే పెడుతున్నారా..?

Authored By
vamana sai
The Telugu News | Updated on: March 25, 2021, 10:17 am
Advertisement

Tollywood movies : సినిమా ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ చేసే సినిమా అందరినీ ఆకట్టుకోవాలనే దర్శక, నిర్మాతలు..హీరో, హీరోయిన్స్ ప్రయత్నిస్తుంటారు. అయితే ప్రేక్షకుల అభిరుచి ఎప్పటికప్పుడు మారుతూ ఉంది. గతంలో ఒక సినిమా అంటే ఉండే లెక్కలు వేరే. ముందు కథ ప్రతీ ఒక్కరికీ నచ్చేది గా ఉండాలి.

Advertisement

interesting news in Tollywood movies

ఇందుకు కోసం కొన్ని నెలల పాటు సీనియర్ దర్శకులు, రచయితలు తలలు బాదుకొని తయారు చేసేవారు. ఏ ఒక్క సన్నివేశం కాస్త ఇబ్బందికరంగా ఉంటుందనిపించినా ఆ సీనిక్ ఆర్డర్ మొత్తం మార్చేసేవారు. అంతగా అప్పట్లో కథ..కథాంశం..స్క్రీన్ ప్లే..మీద ఆలోచించేవారు. రాను రాను జనాల అభిరుచి మారిపోయింది.

Advertisement

గ్లామర్ పాళ్ళు ఎక్కువగా ఆశిస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కంటే యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకొని ఇప్పుడు కథలు తయారవుతున్నాయి. అందులో భాగంగా మన సినిమాల మీద నార్త్ అండ్ హాలీవుడ్ సినిమాల ప్రభావం గట్టిగా పడుతోంది. అందులో భాగంగానే కొన్ని బోల్డ్ కంటెంట్ ఉన్న కథలు మన ముందుకు వస్తున్నాయి. ఈ విషయం లో స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ లాంటి వాళ్ళు ముందుంటున్నారు.

Tollywood movies : జనాలని సినిమా థియేటర్స్ వరకు రప్పించాలంటే లిప్ కిస్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

దాదాపు అన్నీ సినిమాలలో లిప్ కిస్ అన్నది చాలా కామన్ అయ్యింది. ఒకప్పుడు లిప్ కిస్ అంటే సరిగ్గా హీరో హీరోయిన్ ముద్దు పెట్టుకునే సమయానికి రెండు పువ్వులను చూపించేవారు. ఇప్పుడు అలా చూపిస్తే జానాలు తిట్టుకునే పరిస్థితి. వాళ్ళకి కావాల్సిని స్కీన్ మీద హీరోయిన్ తో హీరో మంచి రొమాన్స్ చేయాలి. డీప్ లిప్ లాక్ ఉండాలి. ఎటు నుంచి ఎటొచ్చిందో గాని ఇప్పుడు టాలీవుడ్ లో లిప్ కిస్ లేకపోతే జనాలు ఫీలవుతున్నారు. ఓ మంచి ముద్దు ఉంటే ఆహా చాలు అన్న భావనకి వచ్చేశారు.

Advertisement

కానీ నూటికి తొంబై శాతం మనం స్క్రీన్ చూసే లిప్ కిస్ కెమెరా ట్రిక్స్ అన్న విషయం చాలా మందికి తెలియదు. అర్జున్ రెడ్డి లాంటి కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలలో మాత్రమే రియల్ కిస్ ఉంటుంది. ఏదేమైనా జనాలని సినిమా థియేటర్స్ వరకు రప్పించాలంటే టీజర్..ట్రైలర్..వాల్ పోస్టర్ మీద లిప్ కిస్ ప్రధాన పాత్ర పోషిస్తోంది.

 

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి