Home » Entertainment » Intinti Gruhalakshmi 02 December 2022 Full Episode
Entertainment

Intinti Gruhalakshmi 02 Dec Today Episode : లాస్యకు షాకిచ్చిన ఫ్యామిలీ మెంబర్స్.. అందరూ ఒక్కటయ్యారు.. పరందామయ్య హ్యాపీ.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By
Varun G
The Telugu News | Updated on: December 2, 2022, 9:37 am
Advertisement

Intinti Gruhalakshmi 02 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 805 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదయమే లేచిన తర్వాత లాస్య కొంచెం ఎక్స్ ట్రా చేస్తుంది. అత్తయ్య గారు ట్యాబ్లెట్లు వేసుకుంటారా అంటుంది. రాగి జావ తేనా. మీకు కాళ్లు నొప్పులు కదా.. నేను ఒత్తుతాను అంటూ తెగ ఆవేశపడుతుంది. దీంతో అవసరం లేదమ్మా.. అవన్ని పనులు అయిపోయాయి అంటాడు. ఇంతలో బత్తాయి కావాలని కింద పడేస్తాడు పరందామయ్య. దాన్ని చూసి నేను తీస్తాను మామయ్య అంటుంది. దీంతో దాన్ని నేను తీసి ఇస్తాను అంటుంది. అది బాగోలేదు అంటాడు పరందామయ్య. దీంతో అది బాగానే ఉంది కదా అంటుంది లాస్య. అందరూ తనకు రివర్స్ అయ్యారని అర్థం అవుతుంది లాస్యకు.

Advertisement

intinti gruhalakshmi 02 december 2022 full episode

ఇంతలో తులసి ఫోన్ చేస్తుంది. తులసి ఫోన్ చేయగానే అందరి కళ్లు మెరిసిపోతాయి. చెప్పమ్మా తులసి.. పొద్దున నుంచి నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా అంటుంది అనసూయ. ఎలా ఉంది ఒంట్లో అంటుంది తులసి. బాగానే ఉంది అంటుంది. కానీ కాస్త నీరసంగా ఉంది అంటుంది. దీంతో మీ అత్తయ్యకు నీరసంగా ఉంటేనే మాకు బాగుంటుంది అంటాడు పరందామయ్య. ఆ తర్వాత అందరూ నవ్వుతారు. తర్వాత నిన్ను చూడాలని ఉంది. ఒకసారి ఇంటికి రావచ్చు కదా అంటుంది అనసూయ. అందరూ సంతోషంగా మాట్లాడుకోవడం చూసి షాక్ అవుతుంది లాస్య. తనకు ఏం చేయాలో అర్థం కాదు. వీళ్లంతా కలిసి బాగానే సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది లాస్య.

Advertisement

ఆంటీ రాలేదేంటి అని తులసి గురించి సామ్రాట్ ను అడుగుతుంది హనీ. దీంతో నీ ఎగ్జామ్స్ అని డిస్టర్బ్ చేయలేదు అంటాడు. ఇంతలోనే తులసి వస్తుంది. నీ మీద బెంగ పెట్టుకున్నాను అంటుంది తులసి. ఏంటి రమ్మన్నారు ఏదైనా పని ఉందా అని అడుగుతుంది తులసి.

దీంతో మన మ్యూజిక్ స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి అన్నీ ఒడిదుడుకులే. మీరు కంపెనీలో చేరి కూడా ఒక నెల అయింది. ఇప్పటి వరకు మీకు జీతం కూడా ఇవ్వలేదు. నా జీవితంలో నా చెల్లికి ఎంత ప్రాధాన్యత ఇస్తానో.. మీకు కూడా అంతే ఇస్తాను. అందుకే మీ మొదటి జీతాన్ని అందరిలా బ్యాంకులో వేయకుండా హనీ చేతులతో ఇప్పిద్దామని మిమ్మల్ని రమ్మన్ను అంటాడు సామ్రాట్.

Advertisement

హనీ చేతులతో తన మొదటి నెల జీతాన్ని ఇప్పిస్తాడు. ఆ తర్వాత ఏంటి ఈ రోజు ప్లాన్స్ అంటాడు. దీంతో జీతం వచ్చింది కదా ఇక ఖర్చులు, ప్లాన్స్ అన్నీ చూసుకోవాలి కదా అంటుంది తులసి. దీంతో ఎప్పుడూ ఇవేనా.. మీరు జనరల్ మేనేజర్ కదా అంటాడు సామ్రాట్.

ఒక్క రోజు మీ గృహిణిలా ఉంటాను.. అంటాడు. దీంతో అలా అయితే.. ఈ ఒక్క రోజు మీరు సాధారణ వ్యక్తిలా ఉండండి. నేను ఇచ్చే డబ్బులతో అన్ని పనులు చేయండి అంటుంది తులసి. చాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాడు సామ్రాట్. దీంతో సరే అంటుంది తులసి.

Intinti Gruhalakshmi 02 Dec Today Episode : పరందామయ్యకు ఒళ్లు పట్టిన నందు

కట్ చేస్తే పరందామయ్యకు నందు ఒళ్లు పడుతుంటాడు నందు. ఇంతలో అక్కడికి అంకిత, శృతి వస్తారు. నేను, శృతి కలిసి ఈ నెలకు కావాల్సిన సరుకుల లిస్టు తయారు చేశాం. ఇదివరకు ఇవన్నీ ఆంటీ చూసుకునేది. ఇప్పుడు మీకు ఇస్తున్నాం అంటుంది అంకిత.

ఆయన తీసుకోబోతుండగా అక్కడికి వస్తుంది లాస్య. ఆ లిస్టును తీసుకుంటుంది. లిస్టు తీసుకొని నందు ఏం చేస్తాడు అంటుంది లాస్య. కావాల్సిన సరుకులు తీసుకొస్తాడు అంటాడు పరందామయ్య. దీంతో ఏం పెట్టి తీసుకొస్తాడు. డబ్బు ఉందా. నీ దగ్గర డబ్బు ఎక్కడిది నందు అంటుంది లాస్య.

Advertisement

పరిస్థితి బాగోలేదు. ఉద్యోగం లేదు. జీతం లేదు. కనీసం ఈ ఇల్లు ఉంది కాబట్టి ఉండటానికి కనీసం నీడ అయినా ఉంది. అయ్యో నందు.. నిన్ను నేను ఏం అనడం లేదు.. అంటూ నందు పరువును తీస్తుంది లాస్య. దీంతో అక్కడికి వచ్చిన అభి, ప్రేమ్ ఆ లిస్టును తీసుకుంటారు.

మీరెందుకు ఆ లిస్టును తీసుకున్నారు అని అడుగుతుంది. దీంతో ఈ ఇంటి బాధ్యత చూస్తే మా నాన్న లేదంటే ఆయన కొడుకులుగా మేము అయినా చూసుకోవాలి అంటాడు ప్రేమ్. ఆ సరుకులు మేము తెస్తాం అంటాడు అభి. దీంతో తులసి ఉన్నప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు అంటుంది లాస్య.

దీంతో కాకిలా కావు కావు అని అరవడం కాదు. నీ నిజాయితీ మీద ఇక్కడ ఎవ్వరికీ నమ్మకం లేదు అంటాడు ప్రేమ్. దీంతో నీకు కూడా నమ్మకం లేదా నందు అంటుంది లాస్య. దీంతో నందు ఏం మాట్లాడడు. సంపాదన లేదంటూ వెటకారంగా మా నాన్న ముందు మాట్లాడినప్పుడే నీ ఇంటెన్షన్ అర్థం అయింది అంటాడు ప్రేమ్.

అందరూ కలిసి లాస్యపై చిరాకు పడతారు. దీంతో ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయి. ఈ తాతయ్య మనసు గెలుచుకున్నారు. రండిరా ఇలా రండి అని పరందామయ్య.. అభి, ప్రేమ్ ను హత్తుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి