intinti gruhalakshmi 03 january 2023 full episode
Intinti Gruhalakshmi 03 Jan Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం అయింది. 3 జనవరి 2023, మంగళవారం ఎపిసోడ్ 832 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసి చెప్పగానే ఈ ప్రాజెక్ట్ మేము చేయం. ఇక మీరు వెళ్లిపోవచ్చు అని సామ్రాట్.. బెనర్జీతో చెబుతాడు. మీరు కాకపోతే ఇంకో కంపెనీ చేస్తుంది. మార్కెట్ లో మంచి పేరున్న కంపెనీ కదా అని మీ దగ్గరికి వచ్చాం అంటాడు బెనర్జీ. దీంతో చూడండి బెనర్జీ గారు ఈ ప్రాజెక్ట్ ను మేము మాత్రమే కాదు. ఇంకెవరినీ చేయనివ్వం అంటుంది తులసి. దీంతో ఏం మాట్లాడుతున్నాం. ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేసి స్కూల్ కట్టి నీకు, నీ బాస్ కు ఆహ్వానం పంపుతాం. అప్పుడు నన్ను ఎలా ఆపుతావో నేనూ చూస్తాను అని చెప్పి వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు బెనర్జీ.
intinti gruhalakshmi 03 january 2023 full episode
మరోవైపు శృతి.. టెర్రస్ మీదికి ఎక్కి తలంటు పోసుకొని జుట్టును ఆరబోసుకుంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన ప్రేమ్.. ఏంటి శృతి నువ్వు ఏం చేస్తున్నావు. ఎందుకు టెర్రస్ మీదికి వచ్చావు అని అడుగుతాడు. ఏమవుతుంది అంటుంది. దీంతో నువ్వు ప్రెగ్నెంట్ వి. అలా ఇప్పటి నుంచే రాకూడదు. వద్దు అంటాడు. దీంతో సరే అయితే నేను జుట్టును ఆరబోసుకోనులే అని కూర్చొంటుంది. దీంతో అలాగే తల తూడ్చుకోకపోతే ఏమౌతుందో తెలుసా అంటాడు ప్రేమ్. జలుబు చేస్తుంది. దాని వల్ల.. డాక్టర్ బ్లడ్ టెస్ట్ అంటాడు. ఆ టెస్ట్ అంటాడు. ఈ టెస్ట్ అంటాడు అంటాడు. వెళ్లి తన తల తుడుస్తాడు ప్రేమ్.
నువ్వు ఇదివరకులా ఆసుపత్రి పాలు అయితే నేను తట్టుకోలేను. అందుకే నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు అంటాడు ప్రేమ్. ఇప్పటికైనా తల్లి అయ్యే అదృష్టాన్ని ఇచ్చి శృతి విషయంలో దేవుడు న్యాయం చేశాడు అని అనుకుంటుంది అంకిత.
ఇంతలో అంకిత కూడా ప్రెగ్నెంట్ అయి ఉంటే బాగుండేది అని అంటుంది శృతి. ఇది దేవుడి ప్లానింగ్ కాదు. దేవుడు వేసిన శిక్ష ఇది. ఒకప్పుడు ప్రెగ్నెంట్ విషయంలో నేను చేసిన తప్పుకు శిక్ష ఇది అని అనుకుంటుంది అంకిత.
ఇవన్నీ వింటుంది లాస్య. నాకు మంచి ఆయుధాన్ని ఇచ్చావు. ఇక నేను ఊరుకుంటానా? అని అనుకుంటుంది లాస్య. మరోవైపు తులసిని మెచ్చుకుంటాడు సామ్రాట్. నన్ను నమ్మి ఇంత బాధ్యతను అప్పగించినప్పుడు నా పని నేను చేయాలి కదా అంటుంది తులసి.
వాడికి నీమీదున్న నమ్మకం వేరు. వాడు వాడి గురించి కంటే నీ గురించే ఎక్కువ ఆలోచిస్తాడు అంటాడు బాబాయి. బాబాయి ఏం చెబుతాడో అని టెన్షన్ పడి.. అంటే బాబాయి చెప్పేది అది కాదు అంటూ ఏదో చెప్పబోతాడు సామ్రాట్.
అయినా బెనర్జీకి చాలెంజ్ ఎందుకు చేశారు అని అడుగుతాడు సామ్రాట్. దీంతో మనం నష్టపోకుండా ఉండటమే కాదు.. వేరే వాళ్లు కూడా నష్టపోకుండా ఉండాలి అంటుంది తులసి. మరోవైపు స్కూల్ కు వెళ్లే వేళ అయింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు బాబాయ్.
మరోవైపు బెనర్జీ కారులో వెళ్తూ.. టెన్షన్ పడుతూ ఉంటాడు. ఎలా తులసికి మన గురించి అంతలా తెలిసింది. నా జాతకం మొత్తం తెలిసినట్టు మాట్లాడింది అంటాడు బెనర్జీ. నాకు తెలియట్లేదు సార్ అని అంటాడు పీఏ.
ఆ ప్రాజెక్ట్ ఎవ్వరూ టేకప్ చేయకుండా అడ్డుపడుతుందా? అని అంటాడు బెనర్జీ. వెంటనే రాగసుధ కన్ స్ట్రక్షన్స్ వాళ్లకు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకో అని చెబుతాడు బెనర్జీ. దీంతో వాళ్లు వద్దన్నారు అంటాడు పీఏ.
మరోవైపు కంపెనీ సీఈవో పోస్ట్ ను నీకే ఇచ్చేద్దామని అనుకుంటున్నా. నేను రిటైర్ అవుతా అంటాడు సామ్రాట్. దీంతో ఆపండి ఇక మీ జోకులు అంటుంది. దీంతో నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు తులసి గారు అంటాడు సామ్రాట్.
మీరు ఫైల్ తెచ్చిస్తే ఇంటికెళ్లి వండుకొని తింటాను. నా వల్ల కావడం లేదు అంటుంది తులసి. దీంతో సరే అని పైకి వెళ్తాడు సామ్రాట్. ఇంతలో హనీ వస్తుంది. తనను చూడకుండా ఫోన్ చూస్తూ ఉంటుంది.
ఇంతలో హనీని చూసి హాయ్ హనీ అంటుంది. ఎవరు మీరు అంటుంది హనీ. అసలు మీరు మా ఇంటికి వచ్చి నాతో మాట్లాడి ఎన్ని రోజులు అవుతోంది. మీకు నేను ముందుగా ఫ్రెండ్ అయ్యానా, మా డాడీ ముందు ఫ్రెండ్ అయ్యారా? అని అడుగుతుంది హనీ.
నువ్వే అంటే.. మరి నాకు ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదేనా అంటుంది. దీంతో మరి ఏం చేయాలి అని అడుగుతుంది. దీంతో నన్ను ఇప్పుడు షికారుకు తీసుకెళ్లాలి అంటుంది. దీంతో సరే ఓకే అంటుంది తులసి.
ఈ మధ్య కాలంలో హనీలో ఇంత ఉత్సాహం చూడలేదు అంటాడు బాబాయి. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు కూడా నీరసంగా ఉంది. నీతో మాట్లాడిన ఈ 5 నిమిషాల్లో ఎంత ఉత్సాహం వచ్చిందో చూడు అంటాడు బాబాయి.
దీంతో అదే కదా.. తులసి గారిలో ఉంది అంటాడు సామ్రాట్. నేను కూడా డ్రస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పి వెళ్తాడు సామ్రాట్. మరోవైపు శృతికి అన్నం తినిపిస్తాడు ప్రేమ్. నేనేమన్నా చిన్నపిల్లనా గోరుముద్దలు పెట్టడానికి అని అడుగుతుంది శృతి.
ఎవరైనా చూస్తే బాగోదు అంటే కూడా వినడు ప్రేమ్. ఏం కాదు అని తినిపిస్తాడు. ఇంతలో ఒక మెతుకు తన పెదవి మీద పడటంతో దాన్ని తీయబోతాడు ప్రేమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
This website uses cookies.