Intinti Gruhalakshmi 1 April Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 595 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అనసూయ, పరందామయ్య ఇద్దరూ అనాథాశ్రమంలో చేరుతారు. అక్కడ వాళ్లు పెట్టే భోజనం తినలేకపోతారు. వాళ్లకు తులసి వండిన వంట తప్పితే మరొకరు చేసిన వంట తినలేరు. కానీ.. తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడి ఆహారాన్ని తినాల్సి వస్తోంది. పరందామయ్యకు ముద్ద దిగక వెక్కి వెక్కి ఏడుస్తాడు. నాకు తెలుసు.. ఏమాత్రం రుచిగా లేకపోయినా మీరు తినలేరు. మీకు తులసి చేతివంట తప్పితే ఇంకేదీ నచ్చదు అంటుంది అనసూయ.
దీంతో నచ్చని పనులకు దూరంగా ఉండాలంటే.. నచ్చినవి వదులుకోవాల్సి వస్తుంది.. ఇదే జీవితం అంటే అంటాడు పరందామయ్య. రేపటి గురించి ఆలోచించకుండా ఈరోజును గడపాల్సిందే అంటాడు పరందామయ్య. మరోవైపు ప్రేమ్ ఎవరికో ఫోన్ చేస్తుంటాడు. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. తాతయ్య ఫోన్ కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోంది అని శృతితో చెబుతాడు. ఇంతలో ప్రేమ్ కు ఫోన్ వస్తుంది. తన ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. తాతయ్య వాళ్లు వృద్ధాశ్రమంలో ఉన్నారని చెబుతాడు. వెంటనే తులసికి ఫోన్ చేద్దామనుకుంటాడు కానీ.. వద్దంటుంది శృతి. వెంటనే మాధవికి ఫోన్ చేసి వాళ్లు ఎక్కడున్నారో చెబుతాడు.
కట్ చేస్తే వృద్ధాశ్రమంలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు పరందామయ్య, అనసూయ. అయినా మనకు ఈ కర్మ ఏంటండి అంటుంది అనసూయ. ఆ లాస్య పెట్టే కష్టాల ముందు ఇవేవీ పెద్ద కష్టాలు కాదు అనసూయ అంటాడు పరందామయ్య. మనకే ఈ కర్మ.. అంటాడు పరందామయ్య.
మనం తులసి దగ్గర ఉంటే మనల్ని పువ్వుల్లో పెట్టి చూసుకునేది అంటుంది అనసూయ. ఇంతలో అక్కడికి మాధవి, తులసి వస్తారు. దీనంగా ఉన్న వాళ్లను చూసి షాక్ అవుతారు. మామయ్య అని తులసి పిలుస్తుంది. దీంతో తులసిని చూసి షాక్ అవుతాడు పరందామయ్య.
ఇంతలో అక్కడికి ప్రేమ్ వస్తాడు. కానీ.. వాళ్ల దగ్గరికి వెళ్లకుండా వెనుక నుంచి చూస్తుంటాడు. ఏమ్మా మేము ఇలా ప్రశాంతంగా ఉండటం నీకు ఇష్టం లేదా. మా బతుకు మమ్మల్ని బతకనియ్యు అంటాడు పరందామయ్య. మీ అబ్బాయితో వెళ్లడం ఇష్టం లేకపోతే ఆ విషయం నాకు చెప్పొచ్చు కదా అంటుంది తులసి.
వాళ్ల నిర్ణయం తెలిసినా కూడా మనసు మార్చుకునేలా బలవంత పెట్టాను అని అంటుంది తులసి. కొడుకు దగ్గర ఉండే అదృష్టాన్ని ఇస్తున్నా అనుకున్నా కానీ.. వీళ్లను ఇంతలా బాధపెడుతున్నా అనుకోలేదు అంటుంది తులసి. వాడు నిన్ను వద్దు అనుకున్నప్పుడే కొడుకు మీద ఇష్టాన్ని కాదనుకున్నాం అంటాడు పరందామయ్య.
మీరు అనాథలు కాదు మామయ్య.. మీరు వెళ్లిపోతే మేము అనాథలం అయిపోతాం అంటుంది తులసి. మీరు రాకపోతే ఈ వృద్ధాశ్రమం ముందే దీక్ష చేస్తాను. మీరు నాతో వచ్చేంతవరకు నేను వదిలిపెట్టను. ఆపై మీ ఇష్టం అంటుంది తులసి. జీవితాంతం మీరు నాతోనే కలిసి ఉంటారు అని భరోసా ఇస్తుంది తులసి.
మీ అబ్బాయితో నేను అస్సలు పంపను. నన్ను నమ్మండి అంటుంది తులసి. అలాంటి పరిస్థితే వస్తే.. నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేస్తాను. సరేనా అంటుంది తులసి. ఇంకేం కావాలమ్మా.. బయలు దేరండి ప్లీజ్ అంటుంది మాధవి.
రండి మామయ్య అంటుంది తులసి. సరేనమ్మా అంటాడు పరందామయ్య. ఇవన్నీ ప్రేమ్ వెనుక నుంచి చూస్తుంటాడు. నానమ్మ తాతయ్యలను తిరిగి అమ్మ దగ్గరికి చేర్చాను. నేను లేకపోయినా వాళ్లు అమ్మ దగ్గర ఉన్నారు. ఈ తృప్తి చాలు అని అనుకుంటాడు ప్రేమ్.
కట్ చేస్తే.. వాళ్లను తీసుకొని ఇంటికి వస్తుంది తులసి. మా అంతట మేము వెళ్లాం. మా అంతట మేము వచ్చాం. దయచేసి ఎవ్వరూ ఏ ప్రశ్నలూ అడక్కండి అంటాడు పరందామయ్య. చూడండి నాన్న.. మీరంతట మీరే గడప దాటారో లేక ఎవరైనా దాటించారో కానీ ఇది మాత్రం నాకు నచ్చలేదు అంటాడు నందు.
మాకు నచ్చిన పని చేస్తాం.. నచ్చినట్టు ఉంటాం అంటుంది అనసూయ. అంత నిక్కచ్చిగా ఉండేవాళ్లు అయితే మీ నిర్ణయాన్ని తులసికి మొహమాటం లేకుండా చెప్పాల్సింది అంటుంది లాస్య. మమ్మల్ని ఎందుకు మోసం చేశారు అంటుంది లాస్య.
మీ కొడుకుగా మీరు నా దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటాడు నందు. దయచేసి మాతో రండి అంటాడు నందు. రాములమ్మ.. ఆ లగేజ్ తీసుకెళ్లి అత్తయ్య, మామయ్య గదిలో పెట్టు అంటుంది తులసి. దీంతో నందుకు కోపం వస్తుంది.
తులసి.. నువ్వు మాకు చెప్పింది ఏంటి.. చేసేది ఏంటి అంటాడు నందు. ముందు చెప్పినప్పుడు మీరు నమ్మలేదు. తప్పును సరిదిద్దుకోవాలనుకున్నాను. ఇక వాళ్లు మీతో రారు. మీకు వెళ్లాలనిపిస్తే అది మీ ఇష్టం. వాళ్ల నిర్ణయాన్ని మీరు గౌరవించండి. మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను అంటుంది తులసి.
తులసి ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని నేను చెబుతూనే ఉన్నాను నందు. ఇప్పుడు చూశావా ఏమైందో.. అంటుంది లాస్య. తప్పు చేస్తున్నావు తులసి.. అనుభవిస్తావు అంటాడు నందు. శపిస్తున్నావా.. మీకంటే ముందే ఆ దేవుడు నన్ను శపించాడు అంటుంది తులసి.
కట్టుకున్న పెళ్లాం ముందే పరాయి ఆడదానితో తిరుగుతున్న మిమ్మల్ని నేనే వదిలేశాను అంటుంది తులసి. భార్యగా నువ్వు పెద్ద ఫెయిల్యూర్ అందుకే నేను నిన్ను వదిలేశాను అంటాడు నందు. అవును మరి.. మీ అడుగులకు మడుగులు వత్తుతూ పాతికేళ్లు కాపురం చేశాను.. అది నా ఫెయిల్యూర్ అంటుంది తులసి.
ఆ తర్వాత నందు, లాస్య.. ఇద్దరే ఇంట్లో నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
This website uses cookies.