
intinti gruhalakshmi 1 december 2021 full episode
Intinti Gruhalakshmi 1 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 1 డిసెంబర్ 2021, బుధవారం ఎపిసోడ్ 491 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు వెంటనే లాస్యకు ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అంటుంది తులసి. కానీ.. నందు వద్దు అంటాడు. దీంతో నేను తులసికి ఫోన్ చేస్తా అని లేవబోతుంది తులసి. తనకు కళ్లు తిరుగుతాయి. కిందపడబోతుంది. వెంటనే నందు పట్టుకుంటాడు. అప్పటికే లాస్య వస్తుంది. తులసిని తీసుకొని మంచం మీద పడుకోబెడుతుంది.లాస్య.. నీకే ఫోన్ చేద్దామని అనుకున్నాను. ఈలోపు నువ్వే వచ్చేశావు అంటుంది తులసి. నువ్వేం కంగారు పడకు. నావల్ల నీ పెళ్లికి ఏ అడ్డూ రాదు అంటుంది తులసి.
intinti gruhalakshmi 1 december 2021 full episode
మీ పెళ్లి జరుగుతుంది అంటుంది తులసి. ఆ తర్వాత తులసి నిద్రలోకి జారుకుంటుంది. ఆ తర్వాత నందును లాస్య బయటికి లాక్కెళ్లుతుంది. అందరూ చూస్తుండగానే నందును బయటికి తీసుకెళ్లిపోతుంది. దీంతో ఇంట్లో వాళ్లంతా కంగారు పడతారు. బయటికి ఎందుకు అందరి ముందు నన్ను లాక్కొస్తున్నావు లాస్య.. వదులు అంటాడు నందు.ఇందులో తప్పేముంది.. అంటుంది లాస్య. నిన్ను నమ్ముకున్న నా జీవితం నట్టెట్లో మునిగిపోతుందేమనని నా భయం అంటుంది లాస్య. తులసి బాధ నేను అర్థం చేసుకున్నాను. నా బాధ కూడా నువ్వు అర్థం చేసుకో నందు. ఆరోజు అందరి ముందు నాతో పెళ్లికి ఒప్పుకున్నావు. ఇప్పుడేమో ఏం మాట్లాడటం లేదు.
దయచేసి తులసికి ఆరోగ్యం బాగోలేదని మన పెళ్లిని వాయిదా వేయకు. మనం పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నామో నాకు చెప్పు అంటుంది లాస్య. నాకు ఇంకా సమయం కావాలి అంటాడు నందు. ఇంకా సమయం ఎందుకు అని ప్రశ్నిస్తుంది లాస్య. నేను ఇప్పుడు మెంటల్ ప్రెజర్ లో ఉన్నా అంటాడు నందు.
నువ్వు అనుభవిస్తున్న బాధ నువ్వు నీ వల్ల నువ్వు తెచ్చుకున్నది. కానీ.. తులసి, నేను పడేది మాత్రం నీవల్ల. ఇప్పుడు తులసి ఆసుపత్రిలో ఉన్నది నీవల్ల కదా. దీనికి కారణం నువ్వు కాదా. నువ్వు సంతోషంగా లేవు.. మా ఇద్దరిని సంతోషంగా ఉంచలేకపోతున్నావు.. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటుంది లాస్య.
నువ్వు ఏమైనా చేసుకో. ఇప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిందే. అది ఏ నిర్ణయం అయినా సరే.. నేను ఒప్పుకుంటాను. ఎటువైపు మొగ్గాలనుకుంటున్నావో.. ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నావో నిర్ణయించుకో. ఎవరితో ఉండాలనుకుంటున్నావు.. నాతోనా.. తులసితోనా.. నువ్వు వద్దు అనుకున్న మనిషితోనా.. కావాలని వెంట పడుతున్న మనిషితోనా.. అని సూటిగా ప్రశ్నిస్తుంది లాస్య.
ఒక్కటి గుర్తుపెట్టుకో నందు. నువ్వు లేకుండా నేను బతకలేను.. ఇది నా నిర్ణయం. ఇక మిగిలింది నీ నిర్ణయమే నువ్వు ఏం చేస్తావో అది నీ ఇష్టం అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కట్ చేస్తే తులసిని జాగ్రత్తగా చూసుకుంటారు అందరూ. మీరంతా నన్ను మరీ చిన్నపిల్లలా చూస్తున్నారు అంటుంది తులసి.కట్ చేస్తే.. లాస్య ఒక్కతే ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే అంకిత వస్తుంది. ఏమైంది ఆంటి ఎందుకు ఏడుస్తున్నారు అంటుంది. నందు వల్ల అందరితో నేను మాట పడాల్సి వస్తోంది అంటుంది లాస్య. మీరంటే ఎంత కోపం ఉన్నా నాకు మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది అంటుంది అంకిత.
నన్ను అందరినీ ఒంటరిని చేశారు.. అంటుంది లాస్య. మీలో ఉన్న స్వార్థం తులసి ఆంటిలో లేదు అంటుంది అంకిత. తులసి ఆంటి మంచితనం గురించి నేను చెబుతున్నాను అంటుంది లాస్య. ఎలాగైనా నందుతో నా మెడలో తాళి కట్టించుకుంటా.. అని చెబుతుంది లాస్య. సరే అంటి.. నిన్ను తులసి ఆంటి ఒకసారి రమ్మన్నారు.. అది చెప్పడానికే వచ్చాను అంటుంది అంకిత.
నీది పాతికేళ్ల కాపురం. ఈ పాతికేళ్లలో నువ్వు నందును అర్థం చేసుకొని ఉంటావు కదా అంటుంది లాస్య తులసితో. నిజంగానే నేను ఆయన్ను అర్థం చేసుకొని ఉంటే నాకు ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చేది లాస్య అంటుంది తులసి. మరోవైపు తులసి రిపోర్ట్స్ వచ్చాయని డాక్టర్ కృష్ణ చెబుతాడు. అనుకున్న దానికంటే ఎక్కువ సమస్య ఉందని అనిపిస్తోంది అంటాడు.
తులసికి గర్భాశయంలో క్యాన్సర్ అని చెబుతాడు డాక్టర్. దీంతో నందు షాక్ అవుతాడు. అభి కూడా షాక్ అవుతాడు. నందు అయితే గుక్కపెట్టి ఏడుస్తాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదంటాడు. ఆమె ఈ గండం నుంచి బయట పడాలంటే ముఖ్యంగా మీ ప్రేమ, మీ కుటుంబం ప్రేమ కావాలి అంటాడు డాక్టర్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల గులాబీ పార్టీపై చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరింత…
Gautam Gambhir : టీమ్ ఇండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా…
Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.…
KCC Loan for Farmers : దేశానికి అన్నం పెట్టే రైతన్నను ఆర్థికంగా బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక…
LPG Gas Cylinder 2026: దేశమంతటా LPG Gas Cylinder వినియోగించే కుటుంబాలకు ఇది నిజంగా శుభవార్త. రోజురోజుకు డిజిటల్…
Father and Daughter Love: సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియో లక్షలాది మంది నెటిజన్ల కళ్లను…
Viral Video: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా కుడాల్ నగర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సావంత్ అనే యువకుడు ఇటీవల సెంట్రల్…
SBI Loan: ఇంటి బాధ్యతలతో పాటు కుటుంబ ఆర్థిక అవసరాలను తీర్చే ప్రతి స్త్రీ మనసులో ఒక చిన్న ఆశ…
This website uses cookies.